Suriya: ప్రియదర్శికి స్టార్ హీరో సూర్య నుంచి షాకింగ్ గిఫ్ట్
ఇటీవలే కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రియదర్శి పులికొండ. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగానే మరో సినిమాతో మన ముందుకొచ్చాడీ యంగ్ అంగ్ ట్యాలెంటెడ్ హీరో. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియ దర్శి నటించిన తాజా చిత్రం సారంగ పాణి జాతకం. జాతకాలు, జ్యోతిష్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 25 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రియదర్శి ఖాతాలో మరో హిట్ పడినట్టేనంటున్నారు సినీ ఫ్యాన్స్. సారంగపాణి జాతకం ముందు కోర్టు సినిమాలో నటించాడీ యంగ్ హీరో. అందులో లాయర్ సూర్య తేజ పాత్రలో అద్భుతంగా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి సినీ ప్రముఖులతో పాటు విమర్శకులు కోర్టు సినిమాను ప్రశంసించారు. ప్రియదర్శి నటన అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. తాజాగా ఇదే మూవీలో ప్రియదర్శి నటనకు కోలీవుడ్ స్టార్ దంపతులు ఫిదా అయిపోయారు. అందుకే ఈ యంగ్ హీరోను ప్రశంసిస్తూ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపారు. వారేవరో కాదు సూర్య- జ్యోతిక దంపతులు. కోర్టు సినిమాలో ప్రియదర్శి నటనను మెచ్చుకుంటూ అతనికి ఓ ఫ్లవర్ బొకేతో పాటు చిన్న లెటర్‌ను పంపించారీ లవ్లీ కపుల్. ఈ విషయాన్ని ప్రియదర్శి సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు.మీరు పంపిన సందేశం, పువ్వులు అందుకోవడం నా హృదయాన్ని తాకింది. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ఇద్దరు న్యాయవాదులు చంద్రు, వెంబా వెనక నుంచి గర్వంగా నన్ను తట్టినట్లుగా అనిపించింది. నన్ను బాగా ప్రేరేపించిన ఆ ఇద్దరికీ చాలా ధన్యవాదాలు’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు ప్రియదర్శి. ప్రస్తుతం ఈ నటుడి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ??
హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని
ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త రంగు ‘ఓలో’ కనిపించిందోచ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

