చర్మం కాంతివంతంగా ఉండాలంటే పాటించాల్సిన నియమాలు
మీరు ఎక్కడికైనా ఫంక్షన్ కానీ, మ్యారేజెస్ ఈవెంట్ కానీ వెళ్ళాలంటే ముందుగా ఏం చేస్తారు? మీ స్కిన్ కోసం ఆలోచిస్తారు అంతేనా? నీరు పుష్కలంగా తాగడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. డీటాక్స్ అవుతుంది. మలీనాలూ తొలగిపోతాయి. దీనివల్ల మీ స్కిన్ గ్లో పెరుగుతుంది. సో, బాడీని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవడం ది బెస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్.
ముందుగా మన స్కిన్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుకోవడం. అసలు ఇది మీరు చేస్తున్నారా? అలాగే వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చర్మానికి ఆక్సిజన్, పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. దీంతో స్కిన్ ఫిట్ గా అవుతుంది. అండ్ తెలియని గ్లోనెస్ కూడా వచ్చేస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి చర్మ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే వాటిని ఫాలో అవ్వడం వల్ల మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇంకో విషయం అంటే మీరు ఎప్పుడైనా బయటకు వెళితే కంపల్సరీగా మీరు ఏమి రాసుకోకపోయినా పర్లేదు కానీ, కంపల్సరీగా సన్‌స్క్రీన్ మాత్రం అప్లై చేసుకోండి. ఎందుకంటే బయట ఎండలు మండిపోతున్నాయి. అంటే మన బాడీలో పార్ట్స్ ను, స్కిన్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ముఖ్యంగా ఈ సమర్లో ఎండ నుంచి వేడి నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుగవుతుంది. అంటే హెల్తీ స్కిన్ డెవలప్ అవుతుంది. అండ్ ఈ ఫుడ్స్ నుంచి మనకు విటమిన్లు, మినరల్స్ అందుతాయి. అందులోనూ విటమిన్ సి, ఒమేగా త్రీ లాంటి కొవ్వు ఆమ్లాల వల్ల స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ సాఫ్ట్ గా కూడా అనిపిస్తుంది. చాలామంది రకరకాల క్రీమ్స్ వాడి వాళ్ళ స్కిన్ని పాడు చేసుకుంటారు. అలా మీరు చేయకండి. మీకు సరైన నిద్ర, మంచి ఆహారం, ఒత్తిడి లేని ఉద్యోగం ఉంటే చాలు. మీ స్కిన్ చాలా యవ్వనంగా, బ్రైట్ గా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమ్మర్‌లో హైడ్రేట్‌గా ఉండాలంటేఎలాంటి ఫ్రూట్స్ తినాలి ??
స్టార్ క్రికెటర్‌కు విడాకులిచ్చి.. దిల్ రాజు సినిమా కోసం హైదరాబాద్ కు వచ్చి
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

