Sreeleela: శ్రీలీల ఫేట్ మార్చిన ఫేస్ బుక్ పోస్ట్
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే... రెండో ఆలోచన లేకుండా అందరినోటా పలికే పేరు... శ్రీలీల సీనియర్, యంగ్ హీరోలు అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది. విజయవాడ మూలాలున్న శ్రీలీల పుట్టింది అమెరికాలో పెరిగింది. బెంగళూరులో. కిస్ అనే కన్నడ సినిమాతో 2019లో తెరంగేట్రం చేసిన శ్రీలీల... ఆ తర్వాత భరతే అనే కన్నడ సినిమాలోనూ నటించిందీ.
నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ. అందం, అభినయం, అన్నింటికీ మించి ఎనర్జిటిక్ డ్యాన్స్ తో దుమ్మరేపుతోందీ. సినిమాల్లోకి శ్రీలీల ఎంట్రీ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఓ పోస్ట్ బుక్ పోస్ట్ ఆమె జీవితాన్ని మార్చేసింది. శ్రీలీలకు ఇద్దరు అన్నయ్యలు. వాళ్లమ్మ ప్రతి ఏడాది ముగ్గురికి ఫోటో షూట్ చేయిస్తుందట. అలా తీసిన ఓ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. అది చూసిన కన్నడ డైరెక్టర్ కిస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. అప్పటికి శ్రీలీల నైన్త్ క్లాస్ చదువుతోంది. ఆ సమయంలో తన జుట్టు చాలా పొడుగ్గా, మోకాలు వరకు ఉండేదట. కానీ సినిమా కోసం మొత్తం కత్తిరించుకోవాల్సి వచ్చిందట. శ్రీలీల క్లాసికల్ డ్యాన్సర్. అందుకే తన ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయినా పలికిస్తుంది. శ్రీలీల తల్లి గైనకాలజిస్ట్. కేజీఎఫ్ హీరో యష్ భార్యకు ప్రసవం చేసింది ఆమె. యశ్ శ్రీలీల ఫ్యామిలీ ఫ్రెండ్. దగ్గుబాటి ఫ్యామిలీకి శ్రీలీల దూరపు బంధువు. రానా దగ్గుబాటి ఆ మధ్య తన రియాలిటీ షోలో– తను ఏ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్ళినా, శ్రీలీల కనబడుతుందని కామెంట్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా శ్రీ లీలకి బంధుత్వం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

