Nayanthara: హీరోయిన్ కాక ముందు నయన్ ఏం చేసేదో తెలుసా ??
నయన తార.. లేడీ సూపర్ స్టార్. కెరీర్ ప్రారంభంలో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసిన నయనతార ఇప్పుడు ఆమె డేట్స్ ఇస్తే చాలు అనుకునేంత స్టార్ స్టేటస్ సంపాదించింది. అందుకోసం ఎంతగానో కష్టపడింది. గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేరే స్థాయికి చేరింది. ఇంతకీ ఈ భామ అసలు పేరు ఏంటి.. నటి కాక ముందు ఆమె ఏం చేసేది..? నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ కేరళ కుట్టికి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. నటి కావాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు బుల్లితెరను మార్గంగా ఎంచుకుంది. టీవీ యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టింది. తన బంధువు ఒకరు సినీ రంగంలో పనిచేస్తుండటంతో ఆయన ద్వారా ఆమె ఫొటోలు కొందరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు చేరాయి. దీంతో మనసీనక్కరే మూవీలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా డైరెక్టర్ సత్యన్కు డయానా అనే పేరు నచ్చలేదట. దీంతో బాగా ఆలోచించి డయానా పేరును నయనతారగా మర్చారట. ఆ తర్వాత వరస అవకాశాలతో దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో తన మార్కు చూపించింది. 2005లో తమిళ మూవీ అయ్యా ద్వారా నయనతార హీరోయిన్గా పరిచయమైంది. తొలి చిత్రంలోనే సుప్రీమ్‌స్టార్ శరత్‌కుమార్‌కు జంటగా నటించి ఘన విజయాన్ని అందుకుంది. ఇక చంద్రముఖిలో రజనీకాంత్ కు జోడిగా నటించిన తర్వాత సౌత్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా వారు ఇప్పటికీ నయనతార వెనకే ఉన్నారే తప్ప ఆమెను క్రాస్ చేయలేకపోయారు. 20 ఏళ్లుగా లేడీసూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయన్.. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ సినిమాకు దాదాపు 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుక్క నీటి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహిళ గుండెల్ని పిండేస్తున్న దృశ్యం
శివాలయంలో అద్భుతం.. తండోపతండాలుగా భక్తజనం
300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

