చేప తలలు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

samatha 

29 April 2025

Credit: Instagram

చేపలు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఫిష్ కర్రీ తింటుంటారు.

అందుకే సండే వచ్చిందంటే చాలు చేపల దుకాణాల వద్ద బారులు తీరుతారు. తమకు ఇష్టమైన చేపలను కొనుగోలు చేసుకుంటారు.

ఇక చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకొక్కరికీ ఒక్కో రకం చేపలు అంటే ఇష్టం ఉంటుంది. కొందరికి చేపల తలలు అంటే ఇష్టం ఉంటుంది.

మరి అసలు చేపల తలలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చేపల తలలు తినడం ఆరోగ్యానికి మంచిదేనంట. ఇందులో ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పి

చేప తలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన కంటి చూపు మెరుగు పడటమే కాకుండా, కళ్లు ఆరోగ్యం బాగుంటుందంట.

చేపల తలలో ఖనిజాలు, ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.

బరువు పెరగాలని ప్రయత్నిస్తున్నవారికి ఇవి బెస్ట్. చేపల తలలు తినడం వలన ఇది మీ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.