టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ బ్యూటీ ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకుంది.
కాగా, నేడు అందాల ముద్దుగుమ్మ సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ అమ్మడు జీవితాన్నే మార్చిన 6 బెస్ట్ ఫిల్మ్స్ ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
తలపది విజయ్, సమంతా రూత్ ప్రభు, నిత్యమీనన్ కలిసి నటించిన చిత్రం మెర్సల్. ఈ మూవీతో సమంతకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
రామ్ చరణ్ సరసన సమంత రంగస్థలం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సమంత చాలా బాగ నటించింది.
జనతా గ్యారేజ సినిమాలో కూడా సమంత నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్,సమంత, నిత్యామీనన్ నటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో అత్తవారింటికి దారేది. ఈ సినిమాలో కూడా సమంత చాలా బాగా నటించింది. ఈ సినిమా సామ్‌కు మంచి ఫేమ్ తీసుకొచ్చింది.
అదే విధంగా ఈగ, దూకుడు, కత్తి వంటి సినిమాలు కూడా సమంత కెరీర్ లో బెస్ట్ మూవీస్. ఈ సినిమాలు సామ్ జీవితాన్నే మార్చేశాయని చెప్పవచ్చును.