ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో
మనిషికి ప్రకృతికి అవినాభావ సంబంధం వుంది. చుట్టూ సంచరించే పలు రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటి పై ఆధారపడి మనిషి జీవిస్తుంటాడు. అయితే కోడి , మేక , ఆవులు , పశువులు , కుక్క ఇవన్నీ తమ యజమానికి నమ్మకంగా ఉంటాయి. వారి మాట వినటంతో పాటు పెంపకందారు నివాస ప్రాంతంలో జీవిస్తుంటాయి. ఐతే ఆ ఊర్లో ఉన్న కొండముచ్చు మాత్రం ఊరందరికీ స్నేహితుడిగా మారిపోయింది. ఎవరు ఏది పెట్టినా తినటం అందరితో కలిసిపోవడం తో ఎవరు దాన్ని ఏమి అనటంలేదు. కొన్ని రోజుల క్రిందట ఎక్కడినుండి వచ్చిందో ఒక వానరం ఆ కుటుంబంతో కలిసిపోయింది.
ఆ కుటుంబ సభ్యులు కూడా తమ పిల్లలతో సమానంగానే ఆ వానరాన్ని చూస్తున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోడీ గ్రామంలో జరిగింది.గ్రామానికి చెందిన దాసరి హనుమంతు ఇంటిని ఒక వానరం గత కొన్ని రోజులుగా తన నివాసంగా మార్చుకుంది. కొన్ని రోజుల కిందట ఈ వానరానికి కాలికి దెబ్బ తగలడంతో చరణ్ ధైర్యంతో వానరాన్ని చేరదీసి వైద్యం చేయించాడు. దీంతో అప్పటి నుండి ఆ కుటుంబ సభ్యుల వద్దనే ఈ వానరం ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీరాముడే తమ ఇంటికి ఆంజనేయ స్వామి రూపంలో వచ్చాడని ఆ కుటుంబ సభ్యులు ఆనంద పడుతున్నారు. వారు ఏది ఇచ్చినా తింటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది, వారి పిల్లలతో ఆడుకుంటుంది. గ్రామంలోని అందరూ దానిని ముద్దుగా హనుమంతు, అంజి అనే పేరుతో పిలుస్తున్నారు.
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

