జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో
కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చింది. దాడి చేసి ఓ బాలిక ప్రాణాలు బలిగొంది. నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకున్న ఆ సింహం.. ఓ ఇంట్లోకి చొరబడింది. లోపల ఉన్న ఓ బాలికపై సింహం అమాంతం దూకి దాడి చేసింది. ఆ అమ్మాయిపై పంజా విసిరి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది.
ఇదంతా బాలిక స్నేహితురాలి కళ్లెదుటే జరిగింది. రక్తపు మరకల ఆధారంగా దగ్గరలోని బగాతి నది వద్ద బాలిక మృతదేహాన్ని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ అధికారులు కనుగొన్నారు. వీపు భాగంలో తీవ్ర గాయాలపాలైనట్లు గుర్తించారు. సింహం దాడి కారణంగా బాలిక మృతి చెందినట్లు ప్రకటించారు. నైరోబీ నేషనల్ పార్క్ జనావాసాలకు కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. అక్కడ నుంచి సింహం తప్పించుకుని ఉంటుందని భావిస్తున్నారు. సింహం దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దాన్ని పట్టుకునేందుకు అధికారులు ట్రాప్‌ను ఏర్పాటు చేసారు. కంచెను దాటుకుని సింహం జనావాసాల్లోకి వచ్చినట్లు గుర్తించారు. దీంతో విద్యుత్ కంచెకు ఏర్పాట్లు చేసారు. క్రూర మృగాలకు ఆవాసమైన నైరోబీ నేషనల్ పార్క్ లో సింహాలు, పులులు, చిరుతలతో పాటు వివిధ రకాల జంతువులు ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం
దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?
పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్
10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
