10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో
దేశీయ మార్కెట్లో బంగారం ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష దాటింది. పసిడి పరుగులకు కారణాలు ఏవైనా కొనుగోలుదారులు మాత్రం ధర వినింటనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే తిరుమల వెంకటేశ్వర క్షేత్రంలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది. తిరుపతిలోని బంగారు నగల దుకాణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయిస్తున్న శ్రీవారి డాలర్ గోల్డ్ రేటుకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,42,200 రూపాయలు కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,900 రూపాయలుగా ఉంది. ఇది కేవలం బంగారం ధర మాత్రమే.
నగలు కొంటే జీఎస్టీ 3 శాతం తరుగు అదనం. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ ను టిటిడి వద్ద కాకుండా జ్యువెలరీ షాపుల్లో కొంటే దాదాపు 1,12,900 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఏప్రిల్ 22న ఉన్న ధర ప్రకారం 10 గ్రాముల బంగారం ధర 92,900 రూపాయలు కాగా 18 శాతం తరుగు కింద 1.8 గ్రాముల మేర అదనపు సొమ్ముతో పాటు 3 శాతం జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల శ్రీవారి డాలర్ కోసం 1,12,910 రూపాయల వరకు జ్యువెలరీ షాపుల్లో చెల్లించక తప్పదు. అదే టిటిడి విక్రయ కేంద్రం వద్ద అయితే 10 గ్రాముల శ్రీవారి డాలర్ 90,671 రూపాయలకే లభిస్తుంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో మంగళవారం టిటిడి విక్రయిస్తున్న డాలర్ల ధరను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో 2, 5, 10 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తున్న టిటిడి వాటిని భక్తులకు అందుబాటులో ఉంచింది. బులియన్ మార్కెట్లో ఉన్న రోజువారీ ధరతో సంబంధం లేకుండా టిటిడి భక్తులకు శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తుంది.
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

