AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: మీ లివర్‌ను పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంచే పండ్లు ఇవే..! మీరు తింటున్నారా?

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే లివర్‌ ఫంక్షన్‌ సజావుగా ఉండాలి. దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారం సరిగ్గా ఉన్నప్పుడే మన కాలేయం ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..

Liver Health: మీ లివర్‌ను పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంచే పండ్లు ఇవే..! మీరు తింటున్నారా?
Liver Health
Srilakshmi C
|

Updated on: Apr 29, 2025 | 8:56 PM

Share

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి . మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే లివర్‌ ఫంక్షన్‌ సజావుగా ఉండాలి. దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారం సరిగ్గా ఉన్నప్పుడే మన కాలేయం ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే జీవనశైలిపై తొలుత శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆహారంలో కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు చేర్చుకోవడం చాలా అవసరం. ఇవి కొవ్వు కాలేయ సమస్యలను తగ్గించడానికి బలేగా ఉపయోగపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

లివర్ కు మేలు చేసే పండ్లు ఇవే..

  • నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. ఈ అలవాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
  • నారింజ పండ్లలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం వల్ల కాలేయం నుంచి హానికరమైన పదార్థాలను బయటకు పంపడమే కాకుండా దానిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  • ద్రాక్ష మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. నల్ల ద్రాక్ష కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • యాపిల్స్ లోని ఫైబర్ కంటెంట్ కాలేయంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని శోథ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండు కాలేయ ఒత్తిడిని తగ్గించడంలో, దాని పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
  • బొప్పాయిలో పపైన్ అనే ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ పండు కాలేయాన్ని శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
  • మామిడి పండ్లలో విటమిన్లు ఎ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన కాలేయాన్ని రక్షించడంలో, శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి పండ్లను మితంగా తీసుకుంటే శరీరానికి గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తుంది.
  • పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇందులో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయాన్ని హానికరమైన కారకాల నుంచి రక్షిస్తుంది. ఈ పండు వేసవి రోజుల్లో కాలేయాన్ని చల్లబరుస్తుంది.
  • కివి పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్యాటీ లివర్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లను మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మన కాలేయం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మొత్తం శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్న ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.