AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DOST Notification 2025: దోస్త్‌ నోటిఫికేషన్‌ ఇంకెప్పుడో..? ఇంటర్‌ ఫలితాలొచ్చి వారం గడుస్తున్నా పత్తాలేని ప్రకటన

రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా దోస్త్‌ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్‌ షెడ్యూల్‌ జారీ చేసేవారు..

DOST Notification 2025: దోస్త్‌ నోటిఫికేషన్‌ ఇంకెప్పుడో..? ఇంటర్‌ ఫలితాలొచ్చి వారం గడుస్తున్నా పత్తాలేని ప్రకటన
DOST Notification
Srilakshmi C
|

Updated on: Apr 29, 2025 | 7:34 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. ఇంటర్‌ ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా దోస్త్‌ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్‌ షెడ్యూల్‌ జారీ చేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందో ఉన్నత విద్యామండలి చెప్పలేకపోతుంది. ఈసారి రెండు విడతల్లోనే దోస్త్‌ ద్వారా ప్రవేశాలు నిర్వహించి జూన్‌ 16 నుంచి తొలి సెమిస్టర్‌ తరగతులను ప్రారంభించాలని ప్లాన్‌ చేసింది. ఇంకా దోస్త్ ప్రకటన వెలువడక పోవడంతో అకగమిక్‌ ఇయర్‌ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఈసారి దోస్త్‌లో బకెట్‌ విధానాన్ని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో జరిగిన యూనివర్సిటీ వీసీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత విద్యామండలికి గానీ వీసీలకు గానీ లేదు. దీంతో విద్యాశాఖ కస్సున లేచింది. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ ఆమోదం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం వీసీలతో సమావేశం నిర్వహించినా.. ఆ సమావేశానికి సంబంధించి తీర్మానాల కాపీ (మినిట్స్‌) ఇంతవరకు అందలేదు. దాంతో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీలో జాప్యం నెలకొంది.

మే 2 నుంచి ఏపీ ఆర్టీఈ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమగ్రశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. మొదట ప్రకటించిన షెల్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 28న నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా దానిని మే 2కు వాయిదా వేశామన్నారు. మే19 వరకు స్వీకరన ఉంటుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..