AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్‌ నుంచి తెచ్చిన బోటీ కూరతో భోజనం.. చివర్లో పార్శిల్‌ అడుగున కనిపించిన నల్లటి ఆకారం! ఏంటాని చూడగా..

ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్‌ చేశాడు. దానిని పార్శిల్‌ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఇంట్లోని వారందరు ఆ కూరను భోజనంతో పాటు తిన్నారు. తినగా ఇంకాస్త కూర మిగిలింది. దానిని భద్ర పరిచేందుకు పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూడగా లోపల కనిపించిన..

హోటల్‌ నుంచి తెచ్చిన బోటీ కూరతో భోజనం.. చివర్లో పార్శిల్‌ అడుగున కనిపించిన నల్లటి ఆకారం! ఏంటాని చూడగా..
Rat Found In Hotel Boti Curry
Srilakshmi C
|

Updated on: Apr 27, 2025 | 11:37 AM

Share

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 27: ఓ వ్యక్తి నగరంలోనే పేరొందిన ప్రముఖ హోటల్‌కి వెళ్లాడు. అక్కడ తనకెంతో ఇష్టమైన బోటీ కూర ఆర్డర్‌ చేశాడు. దానిని పార్శిల్‌ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు ఇంట్లోని వారందరు ఆ కూరను భోజనంతో పాటు తిన్నారు. తినగా ఇంకాస్త కూర మిగిలింది. దానిని భద్ర పరిచేందుకు పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూడగా లోపల కనిపించిన సీన్‌ చూసి దాదాపు వాంతి చేసుకున్నంత పనైంది. ఈ షాకింగ్‌ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన కథనం ప్రకారం..

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ హోటల్‌కి హరీశ్‌ అనే వ్యక్తి ఏప్రిల్ 25 సాయంత్రం (శుక్రవారం) 4 గంటల సమయంలో వెళ్లాడు. ఆ హోటల్‌లో బోటీ కూర పార్సిల్‌ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి అందరూ భోజనంలో బోటీ కూర తిన్నారు. అందరూ తినగా మిగిలిన అదే పార్సిల్‌ను ఓపెన్‌ చేసి అడుగున ఉన్న కూరను ఓ పాత్రలో వేయగా.. బాగా మాసాలా దట్టించి కూరలో కలిసి పోయిన ఎలుక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన హరీశ్‌ కుటుంబ సభ్యలను తీసుకుని ఆస్పత్రికి పరుగు తీశాడు.

అనంతరం అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో వెళ్లి హోటల్‌ నిర్వాహకుడిని నిలదీశాడు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌కు వెళ్లి వాకబు చేశారు. హరీశ్‌ ఫిర్యాదు మేరకు జిల్లా ఆహార తనిఖీ అధికారి మనోజ్‌కుమార్‌ హోటల్‌పై దాడి చేశారు. బిర్యానీ, వంటగది పరిసరాలను పరిశీలించి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. బోటీ కూరలో ఎలుక ప్రత్యక్షమైన ఘటనకు సంబంధించిన ఫొటోల ఆధారంగా అడిషనల్ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం హోటల్‌ యాజమన్యానికి సమన్లు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగడంతో ఒక్కసారిగా నగరమంతా ఉలిక్కిపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.