AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC 2025 Application: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్‌ రిలీఫ్‌.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి లోకేష్‌!

ఏప్రిల్‌ 20న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ విడుదలైన కాపేపటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కానీ నాటి నుంచి భ్యర్ధులు దరఖాస్తు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఫీజు కట్టడంలో ఇబ్బంది ఎదురైతే, మరికొందరికీ డిగ్రీ, బీఈడీలో అర్హత మార్కుల విషయంలో సమస్య తలెత్తుతుంది. ఇంకోవైపు సర్టిఫికేట్ల అప్‌లోడింగ్‌ కూడా గందరగోళంగా ఉండటంతో పలువురు అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది..

AP DSC 2025 Application: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్‌ రిలీఫ్‌.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి లోకేష్‌!
AP DSC 2025 Application
Srilakshmi C
|

Updated on: Apr 29, 2025 | 3:27 PM

Share

అమరావతి, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను ఏప్రిల్‌ 20 విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 16,347 ఉపాధ్యాయ కొలువులకు సమర శంఖం పూరించింది. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నిరుద్యోగులు రాత్రింబగళ్లు పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అయితే డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా ఏప్రిల్‌ 20 నుంచే ప్రారంభమైనప్పటికీ.. నాటి నుంచి అభ్యర్ధులు దరఖాస్తు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఫీజు కట్టడంలో ఇబ్బంది ఎదురైతే, మరికొందరికీ డిగ్రీ, బీఈడీలో అర్హత మార్కుల విషయంలో సమస్య తలెత్తుతుంది. ఇంకోవైపు సర్టిఫికేట్ల అప్‌లోడింగ్‌ కూడా గందరగోళంగా ఉండటంతో పలువురు అభ్యర్ధులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీఈడీకి, టెట్‌కు డిగ్రీలో 40 శాతం మార్కుల అర్హత ఇచ్చారు. అయితే డీఎస్సీకి మాత్రం 45 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించడంతో అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక జనరల్‌ అభ్యర్థులకు ఏకంగా 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పడంతో తికమకలో పడ్డారు. టెట్‌ దరఖాస్తుకు అర్హత సాధించిన మా మార్కులు, డీఎస్సీ దరఖాస్తుకు ఎలా పనికి రాకుండా పోయాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన విద్యాశాఖ విద్యార్హతలను సడలించింది.

ఇవి కూడా చదవండి

అలాగే దరఖాస్తు చేసే సమయంలో పార్ట్‌ 2 విభాగంలో సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయడం కేవలం ఆప్షనల్ మాత్రమేనని చెబుతూ మంత్రి లోకేష్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం కచ్చితంగా ఒరిజినల్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఓవైపు డీఎస్సీ పరీక్షలు సమీపిస్తుంటే.. కుల, నివాస ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అభ్యర్ధులకు బిగ్‌ రిలీఫ్‌ లభించినట్లైంది. కాగా డీఎస్సీ పరీక్షలు జూన్‌ 6 నుంచి జులై 6 వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..