జున్ను ధర రూ.లక్ష.. అంత స్పెషల్ ఏమిటంటే?
samatha
29 April 2025
Credit: Instagram
జున్ను అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా జున్నును తింటుంటారు
ఇక జున్న ధర కూడా మరి అంత ఎక్కువ ధర కూడా ఉండదు. కానీ అక్కడ మాత్రం కిలో జున్ను ధర ఏకంగా లక్ష రూపాయలంట. ఎందుకంటే?
గాడిద పాలతో తయారు చేసిన చీజ్ ప్రపంచంలోనే చాలా ఖరీదైనది. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.
అందుకే అంతర్జాతీయ మార్కెట్ లలో దీని ధర కిలోకు రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు ఉంటుంది అంట. అసలు దీని ధర
ఎందుకు ఎక్కువ అంటే?
ఒక గాడిద రోజుకు 200 నుంచి 500 మి.లీ. పాలు మాత్రమే ఇస్తుంది. ఒక కిలో జున్ను తయారు కావాలంటే దాదాపు 5 నుంచి 7 లీటర్ల పాలు అవసరం.
పాల లభ్యత పరిమితంగా ఉండటం, దీనికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటం, ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి దీని ధర చాలా ఎక్కువగా ఉంటుందంట
.
గాడిద పాలలో ప్రోటీన్, విటమిన్ బి, డి, ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుం
ది.
అంతే కాకుండా దీనిని ప్రతి రోజూ తినడం వలన చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. అందువలన దీని ధర చాలా ఎక్కువ ఉంటుందంటున్నారు నిపుణులు.
మరిన్ని వెబ్ స్టోరీస్
సమంత జీవితాన్నే మార్చిన టాప్6 మూవీస్ ఇవే !
తక్కువ రద్దీ ఉండే ఈ ప్రదేశాల్లో సమ్మర్ ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు!
చనిపోయి కాటికి వెళ్లే వరకు తోడుగా ఉండే నాలుగు ఇవే !