AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Head Bath Rules: స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా.. ఏరోజున చేయడం శుభప్రదం అంటే..

స్త్రీలు తల స్నానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. మహిళలు ఏ రోజున తల స్నానం చేయాలి? ఏ రోజున తల స్నానం చేయకూడదో తెలుసుకోవాలి. అయితే ఈ నియమాలు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కనుక ఈ రోజు స్త్రీలు తల స్నానం ఏ రోజున చేయడం శుభప్రదం.. ఏ రోజున తల స్నానం చేయడం దురదృష్టాన్ని తెస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..

Head Bath Rules: స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా.. ఏరోజున చేయడం శుభప్రదం అంటే..
Head Bath Rules
Surya Kala
|

Updated on: Apr 29, 2025 | 9:27 PM

Share

హిందూ మతంలో మహిళలు తల స్నానం చేసే విషయంలో కొన్ని నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. దీని ప్రకారం కొన్ని రోజులు తల స్నానం చేయడం శుభప్రదం కాగా మరి కొన్ని రోజులు అశుభకరంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకాలు సాంప్రదాయకమైనవి. వివిధ ప్రాంతాలు, కుటుంబాలకు అనుగుణంగా మారవచ్చు. కొంతమంది ఈ ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తారు. మరికొందరు వాటిని అస్సలు పట్టించుకోరు. అవసరం లేదా పరిశుభ్రత వంటి వివిధ కారణాల వలన వ్యక్తులు ఏ రోజు అయినా తల స్నానం చేయడానికి ఎంచుకోవచ్చు. ఈ నమ్మకాలు అసౌకర్యం లేదా బాధ కలిగించినప్పుడు వాటిని కఠినంగా అనుసరించడం కంటే.. వాటి సాంస్కృతిక ప్రాముఖ్యత, జ్యోతిషశాస్త్ర సందర్భాన్ని అర్థం చేసుకుని వాటిని స్వీకరించడం ముఖ్యం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం మహిళలు తల స్నానం చేసే విషయంలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ఈ నమ్మకాల ప్రకారం వివాహిత స్త్రీలు ప్రతిరోజూ తల స్నానం చేయరాదు. వివాహిత స్త్రీలు మంగళవారం, గురువారం , శనివారం వంటి కొన్ని రోజులలో తల స్నానం చేయడం నిషేధించబడింది. అయితే సోమవారం, శుక్రవారం, ఆదివారం వివాహిత స్త్రీలు తల స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

పండుగలు రోజులలో మహిళలు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. కొన్నిసందర్భాల్లో ఇలా చేయకపోవడం భర్త వయస్సు,ఆర్ధిక పురోగతిని ప్రభావితం చేస్తుందని కూడా ప్రస్తావించబడింది. కనుక మహిళలు తల స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని మతపరమైన నియమాలను తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఈ నియమాలను పాటించండి

  1. వివాహిత స్త్రీలు మంగళవారం, గురువారం, శనివారం తల స్నానం చేయరాదు. ఈ రోజుల్లో తల స్నానం చేయడం వలన భర్తకు దురదృష్టం, ఇంట్లో పేదరికం వస్తుందని నమ్ముతారు.
  2. శుక్రవారం: ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున తల స్నానం చేయడం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున తల స్నానం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. అందం కూడా పెరుగుతుంది.
  3. ఆదివారం తల స్నానం చేయడానికి అనువైనదిగా పరిగణించబడుతుంది, అయితే ఆదివారం తల స్నానం వివాహిత స్త్రీలు కాదు, పెళ్లికాని అమ్మాయిలు, పురుషులు ఈ రోజున తల స్నానం చేయవచ్చు.
  4. వివాహిత స్త్రీలు ఏకాదశి రోజున తల స్నానం చేయరాదు. ఎందుకంటే ఇలా చేయడం వలన ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం ఉండదు.
  5. అమావాస్య, పౌర్ణమి, గ్రహణం రోజున తల స్నానం చేయడం వలన స్త్రీలు చేసిన పుణ్యం పోతుడ్ని. అంతేకాదు పూర్వీకులు కోపానికి గురవుతారు.
  6. సూర్యాస్తమయం , రాత్రి సమయంలో తల స్నానం చేయడం వలన ఇంట్లో సమస్యలు వస్తాయి . అనారోగ్యం వస్తుంది.
  7. శారీరక అశుద్ధత , లైంగిక సంపర్కం తర్వాత తలస్నానం చేయడం, లేదా స్నానం చేయడం అవసరం.
  8. పెళ్లికాని అమ్మాయిలు బుధవారం రోజున తల స్నానం చేయరాదు. ఎందుకంటే ఇది వారి జీవితంలో ఇబ్బందులను తెస్తుందని నమ్ముతారు.
  9. ఆలయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే లేదా ఏదైనా శుభకార్యం తర్వాత తల స్నానం చేయరాదు. ఇలా చేయడం వల్ల అదృష్టం పోయి దురదృష్టం కలుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం డెడ్ లైన్.. ఈ నెల 9వరకే..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
నెల్లూరు పప్పులుసు మాములుగా ఉండదు..
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
వ్యాపారులకు డబుల్ గుడ్‌న్యూస్.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..
సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా..