AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: మల్లన్నకి భారీగా పెరిగిన ఆదాయం.. 28 రోజుల్లో ఎంత హుండీ కలెక్షన్ వచ్చిందంటే..

ఆంధ్రపదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం. ప్రముఖ శైవ, శక్తి పీఠం. ఇక్కడ ఆదిదంపతులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిలుగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. రోజు రోజుకీ మల్లన్న ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రోజు మల్లన్న ఆలయంలో హుండీలను లెక్కించారు.

Srisailam: మల్లన్నకి భారీగా పెరిగిన ఆదాయం.. 28 రోజుల్లో ఎంత హుండీ కలెక్షన్ వచ్చిందంటే..
Srisailam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 29, 2025 | 8:59 PM

Share

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మైన శ్రీశైలం మల్లన్న ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 61 లక్షల 42 వేల 016 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 105 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి 4 కేజీల 860 గ్రాములు లభించింది.

నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 644, సౌదీ అరేబియా రియాల్స్ 50, యుఏఈ దిర్హమ్స్115, యూకే పౌండ్స్ 670, సింగపూర్ డాలర్లు 54, కెనడా డాలర్లు 25, ఒమన్ బైసా 100, మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఆలయాలే టార్గెట్..సింగిల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్వం దోచేస్తున్న కేటుగా
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇంటి ముందు డైలీ కళ్లాపి చల్లుతున్నారా..? అయితే జాగ్రత్త..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..