AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే అక్షయ తృతీయ.. పూజ, షాపింగ్ కోసం శుభ సమయం.. చేయాల్సిన దానాలు ఏమిటంటే..

అక్షయ తృతీయ హిందువులు, జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. దీనిని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తదియ తిథి రోజున జరుపుకుంటారు. 2025 లో అక్షయ తృతీయ పండుగ పూజ సమయం ఎప్పుడు? ఈ రోజున బంగారం కొనడానికి శుభ సమయం గురించి తెలుసుకుందాం..

రేపే అక్షయ తృతీయ.. పూజ, షాపింగ్ కోసం శుభ సమయం.. చేయాల్సిన దానాలు ఏమిటంటే..
Akshaya Tritiya
Surya Kala
|

Updated on: Apr 29, 2025 | 6:04 PM

Share

అక్షయ తృతీయ అనేది హిందువులు, జైనులు జరుపుకునే పండుగ.దీనిని వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే ఏదైనా మంచి పని “అక్షయ” అంటే నాశనం చేయలేని ఫలాలను ఇస్తుందని నమ్ముతారు. ‘అక్షయ’ అంటే ‘ఎప్పటికీ తగ్గనిది’ అని, ‘తృతీయ’ అంటే ‘మూడవ రోజు’ అని అర్థం. అందువల్ల ఈ రోజు శాశ్వతమైన, నాశనం చేయలేని అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఈ రోజున గృహప్రవేశం, భూమి పూజ, శుభ సమయం చూడకుండా కొత్త వ్యాపారం ప్రారంభించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజంతా శుభప్రదమైన సమయం.

అక్షయ తృతీయ ఎప్పుడంటే పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిధి ప్రకారం..అక్షయ తృతీయను 2025 ఏప్రిల్ 30న జరుపుకుంటారు.

అక్షయ తృతీయ పూజ శుభ ముహూర్తం పంచాంగం ప్రకారం ఈ రోజు పూజకు శుభ సమయం ఉదయం 6:07 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అక్షయ తృతీయ రోజున షాపింగ్ చేయడానికి శుభ సమయం జ్యోతిషశాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సంపద , శ్రేయస్సుకు చిహ్నం. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం బంగారం కొనడానికి శుభ సమయం ఏప్రిల్ 30న ఉదయం 5:33 నుంచి ఏప్రిల్ 30న తెల్లవారుజామున 2:50 వరకు ఉంది.

అక్షయ తృతీయ పూజా విధానము అక్షయ తృతీయ రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం శుభప్రదంగా భావిస్తారు. గంగా జలం కలిపి స్నానం చేయండి. వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయడం ఇంకా మంచిది. ముందుగా ఈ రోజున ఇంటిని, ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేయండి. తరువాత పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని శుభ్రమైన ప్రదేశంలో పరచండి. దానిపై విష్ణువు , లక్ష్మీ దేవి విగ్రహాలు లేదా చిత్రాలను ప్రతిష్టించండి. గణేశుడు, కుబేరుడి విగ్రహాలను కూడా ఉంచుకోవచ్చు. విగ్రహాలపై గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి. విగ్రహాలకు గంధం, కుంకుమ తిలకం దిద్దండి. విష్ణువుకు పసుపు పువ్వులు, లక్ష్మీ దేవికి తామర పువ్వులు సమర్పించండి.

అలాగే బియ్యం దుర్వా గడ్డి, కొబ్బరి కాయ, తాంబూలాన్ని, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి. పండ్లు, స్వీట్లు.. ముఖ్యంగా బార్లీ లేదా గోధుమ సత్తు, పప్పుధాన్యాలు సమర్పించండి. ఈ నైవేద్యం సమర్పించే సమయంలో తులసి దళాలను తప్పకుండా వేయండి. విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం లేదా విష్ణు, లక్ష్మీ మంత్రాలను జపించండి. గణేష్ చాలీసా, కుబేర్ చాలీసా కూడా పఠించవచ్చు. నెయ్యి దీపం వెలిగించి విష్ణువు, లక్ష్మీ దేవికి హారతి ఇవ్వండి. పూజ తర్వాత దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులకు పెట్టి.. అనంతరం ఇతరులకు పంచండి.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత అక్షయ తృతీయ రోజును హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున పరశురాముడు జన్మించాడు. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయపాత్ర ఇచ్చాడు. దీని కారణంగా వారికి ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడలేదు. సత్యయుగం, త్రేతాయుగం కూడా ఈ రోజే ప్రారంభమైనట్లు నమ్ముతారు. ఈ రోజున నీరు, ఆహారం, బట్టలు, బంగారం, ఆవు, భూమిని దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా పేదలకు, అవసరంలో ఉన్నవారికి దానం చేయడం చాలా పుణ్యప్రదం. ఈ రోజున ప్రజలు బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఇది శ్రేయస్సు, మంచి భవిష్యత్తుకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే