AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakuna Shastra: ఇంట్లో ప్రతిరోజూ జరిగే మంచి, చెడు శకునాల గురించి తెలుసుకోండి..

శకున శాస్త్రం, లేదా నిమిత్త శాస్త్రం అనేది జ్యోతిషశాస్త్ర శాఖలలో ఒకటి. ఈ శకున శాస్త్రంలో మన దైనందిన జీవితంలో జరిగే అనేక విషయాలు లేదా సంఘటనలు వాటి వెనుక దాగున్న మంచి, చెడుల గురించి వెల్లడించారు. ఈ శకున శాస్త్రంలో కొన్ని వస్తువులు, కొందరు వ్యక్తులు శుభ శకునాలు గాను కొన్ని అశుభ శకునాలు గానూ భావిస్తారు. ఈ నేపధ్యంలో గాజు పగలగొట్టడం శుభమా లేక అశుభమా తెలుసుకుందాం..

Shakuna Shastra: ఇంట్లో ప్రతిరోజూ జరిగే మంచి, చెడు శకునాల గురించి తెలుసుకోండి..
Shakuna Shastram
Surya Kala
|

Updated on: Apr 29, 2025 | 4:35 PM

Share

హిందూ మతంలో మంచి, చెడు శకునాలు అనేవి వాటిని నమ్మే వారికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్న భావనలు. కుటుంబ జీవితంలోని రోజువారీ పనులతో ముడిపడి ఉన్న అనేక మంచి, చెడు శకునాలు ఉన్నాయి. శకునాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అయితే చెడు శకునాలు రాబోయే కష్టాల గురించి ఒక వ్యక్తిని హెచ్చరిస్తాయి. సనాతన ధర్మంలో హిందూ గ్రంథాలలో, పురాణాల్లో శుభ శకునాలు, చెడు శకునాల గురించి మనకు అనేక కథలు కనిపిస్తాయి. ఈ రోజు మనం సాధారణ గృహోపకరణాల శకునాలు, చెడు శకునాల గురించి తెలుసుకుందాం..

పాలు పొంగితే ఉదయం పాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు. పాలు మరుగుతున్న సమయంలో అవి బయట పడటం కూడా శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల ఇంట్లో ఆనందం, శాంతి లభిస్తాయని అంటారు. మరోవైపు పాలు చే జారి కింద పడడం చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. పాలు కింద పడడం అంటే రానున్న కాలంలో ఏదో ప్రమాదం జరగనున్నదని సంకేతంగా భావిస్తారు. అందుకే పాలు చిందించడం చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది.

కత్తి చేజారితే కత్తి అనేది అనేక మంచి, చెడు శకునాలను కలిగి ఉన్న ఒక వస్తువు. కత్తి చేతిలోంచి కింద పడడం అశుభంగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారితీస్తుంది. నవజాత శిశువు దిండు కింద కత్తిని ఉంచడం శుభప్రదం ఎందుకంటే ఇది బిడ్డను దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది. ఎవరైనా మీకు కత్తిని బహుమతిగా ఇస్తే అది దురదృష్టకరం.

ఇవి కూడా చదవండి

గాజు పగలడం ఇంట్లో గాజు లేదా అద్దం పగలడం దురదృష్టకరం. ఒక అద్దం లేదా ఏదైనా గాజు వస్తువు చేతిలో నుంచి జారి విరిగిపోతే అది అశుభంగా పరిగణించబడుతుంది. పగిలిన అద్దంలోకి చూసుకోవడం కూడా చెడ్డ శకునమే.

సూర్యాస్తమయం తర్వాత చీపురు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం దురదృష్టకరమని భావిస్తారు. మరోవైపు ఇంట్లో చిన్న పిల్లలు అకస్మాత్తుగా చీపురు పట్టుకుని ఇంటిని ఊడ్చడం ప్రారంభిస్తే.. ఇంటికి అనుకోని అతిథి రాబోతున్నాడని అర్థం చేసుకోవాలట.

నీరు నిండిన బకెట్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నీరు లేదా పాలు నిండిన బకెట్ చూడటం శుభప్రదంగా భావిస్తారు. బయటకు వెళ్ళేటప్పుడు ఖాళీ బకెట్ చూడటం అశుభంగా పరిగణించబడుతుంది. ఇలా ఖాళీ బకెట్ కనిపిస్తే వెళ్తున్న పని జరగదని విశ్వాసం.

నల్ల బట్టలు సనాతన ధర్మంలో నల్లని దుస్తులను చాలా అశుభకరమైనవిగా భావిస్తారు. ఎవరైనా నల్లటి దుస్తులు ధరించి ఇంటి నుండి బయటకు వెళుతున్నట్లు కనిపిస్తే అది దురదృష్టకరమని భావిస్తారు.

పత్తి శకునము ఎవరికైనా బట్టలకు దూది ఇరుక్కుపోతే, అది శుభసూచకం. ఇది కొన్ని శుభవార్తలను వినిపిస్తుందని సంకేతం లేదా మీ ప్రియమైన వ్యక్తి రానున్నారని ముందస్తు సూచనట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..