AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఇప్పుడు కోట్ల రెమ్యునరేషన్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్.. మరి మొదటి సినిమా పారితోషకం ఎంతో తెలుసా..

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ విదేశాల్లో సైతం విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోగా ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో అడుగు పెట్టారు. గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించి.. ప్రస్తుతం ఏపీ డిప్యుటీ సీఎంగా తనదైన మార్క్ పాలనతో పవన్ కళ్యాణ్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్నప్పటికీ పవన్ సినిమాల్లో నటించాలని వెండి తెరపై కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం రెడీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

Pawan Kalyan: ఇప్పుడు కోట్ల రెమ్యునరేషన్ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్.. మరి మొదటి సినిమా పారితోషకం ఎంతో తెలుసా..
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Apr 29, 2025 | 3:43 PM

Share

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ తెలుగు వెండి తెరపై అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అడుగు పెట్టాడు. మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి యుత్ కి దగ్గర అయ్యారు పవన్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందరికీ అబిమానులు ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు.. ఆయన్ని నడిచే దైవంగా భావిస్తారు. ప్రేమిస్తారు. అందుకనే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా రిలీజ్ అయిన సినిమా తేదీని పవనిజం డేగా జరుపుకుంటారు. అన్న చాటు తమ్ముడిగా 1996లో వెండి తెరపై అడుగు పెట్టినా.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ స్టార్ హీరోల్లో ఒకరుగా ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కొంత మంది సెలబ్రిటీ సైతం మేము పవన్ కళ్యాణ్ కి అభిమానులం అని చెప్పుకునే స్టేజ్ కి చేరుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు పాన్ ఇండిగా స్టార్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు.

రాజకీయాల్లో అడుగు పెట్టి.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజిబిజిగా ఉన్న పవన్ కళ్యాణ్ నేటికీ టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరని చెప్పవచ్చు. ఇప్పుడు పవన్ సై అంటే చాలు సినిమా చేయడానికి, పారితోషికంగా కోట్లు చెల్లించడానికి నిర్మాతలు రెడీ. అయితే పవన్ కళ్యాణ్ , సుప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు నిర్మాతైన అల్లు అరవింద్ .. పవన్ కళ్యాణ్ కు పారితోషకంగా ఎంత ఇచ్చారో తెలుసా..

పవన్ కళ్యాణ్ , సుప్రియ ప్రధాన పాత్రలో నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో 1996లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ఇవీవీ సత్యనారాయణ. అంతేకాదు హిందీ హిట్ మూవీ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ని తెలుగులో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రీమేక్ చేశారు. రిలీజైన తర్వాత మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే పవన్ ఈ సినిమాలో చేసిన రియల్ స్టంట్స్ తో యువతని ఆకట్టుకున్నారు. ఇప్పుడు రోజుకి కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అరవింద్ తనకు సినిమాలో నటించినందుకు నెలకు జీతాన్ని ఇచ్చారని చెప్పారు. ఈ చిత్రానికి గాను కొన్ని నెలలు నెల పాటు నెలకు రూ. 5,000 పారితోషికం అందుకున్నానని చెప్పారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం