Astro Tips: ఇంట్లో సమస్యలుంటే నెమలి ఈకలతో ఈ పరిహారాలు చేసి చూడండి..
నెమలి అందమైన పక్షి. నెమలికి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు నెమలి ఈకలకు సంబంధించిన కొన్ని నివారణలు కూడా అంతే ప్రభావవంతంగా ఉంటాయి. హిందూ మతంలో నెమలిని శుభప్రదమైన పక్షిగా భావిస్తారు. నెమలి ఈకలకు సంబంధించిన పరిష్కారాలతో జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకుని వస్తాయి.

నెమలి ఎంత అందంగా కనిపిస్తుందో దాని ఈకలు కూడా అంతే అందంగా కనిపిస్తాయి. నెమలిని శుభానికి చిహ్నంగా భావిస్తారు. నెమలి సుబ్రమణ్య స్వామికి వాహనం. అంతేకాదు నెమలికి సరస్వతి, లక్ష్మీదేవికి సంబంధం ఉంది. శ్రీ కృష్ణుడు నెమలి పించాన్ని కిరీటంలో ధరిస్తాడు. పురాతన కాలం నుంచి ఋషులు, సాధువులు నెమలి ఈకలతో తయారు చేసిన పెన్నులను ఉపయోగించి తమ గ్రంథాలను రచించినట్లు నమ్మకం. కలలో లేదా నిజ జీవితంలో నెమలిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దుష్ట శక్తుల ప్రభావం నుంచి నెమలి రక్షిస్తుందని అంటారు. కనుక ఈ రోజు ఇంట్లో సానుకూలతను వ్యాప్తి చేయడానికి నెమలి ఈకకు సంబంధించిన కొన్ని నివారణల చర్యలను గురించి తెలుసుకుందాం..
నెమలి ఈకకు సంబంధించిన పరిహారాలు ఏమిటంటే
- ఇంట్లో నెమలి ఈకను ఉంచుకోవడం వల్ల శుభం, ఆనందం, శ్రేయస్సు, లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి.
- ఇంట్లో నెమలి ఈకను ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు నశించి సానుకూల శక్తులు చురుగ్గా మారుతాయి.
- కాల సర్ప దోషం ఉన్నవారికి నెమలి ఈకను పూయడం ద్వారా.. కాల సర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం.
- కాల సర్ప దోషంతో బాధపడుతున్న వ్యక్తి సోమవారం రాత్రి నిద్రపోయే సమయంలో తన దిండు కింద ఏడు నెమలి ఈకలను ఉంచుకోవాలని చెబుతారు.
- అదేవిధంగా గది పశ్చిమ గోడపై నెమలి ఈకలను ఉంచడం వల్ల కూడా కాల సర్ప దోషం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.
- ఇంటి ఆగ్నేయ మూలలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం ఉండదు, ఆకస్మిక ఇబ్బందులు రావు.
- మీకు భయంగా మనసు చంచలంగా అనిపిస్తే బెడ్ రూమ్ లో నెమలి ఈకను పెట్టుకోండి.
- నెమలి ఈకను తనతో ఉంచుకునే వ్యక్తి దగ్గరకు దురదృష్టం చేరదని నమ్మకం.
- శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మంగళవారం రోజున హనుమంతుని సింధూరాన్ని నెమలి ఈకపై అద్దండి. దానిని మీతో ఉంచుకోండి. ఇలా చేయడం శత్రువుల భయాన్ని తొలగిస్తుంది.
- నెమలి గురించి నమ్మకం ఏమిటంటే ఈ పక్షి లేదా ఈ నెమలి ఈక ఉన్న ప్రదేశంలో దుష్ట శక్తుల ప్రభావం దరి చేరదని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








