AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Trithiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు శుభ సమయం ఇదే.. పూర్తి వివరాలు

అక్షయ తృతీయ వచ్చేసింది! రేపే అక్షయ తృతీయ.. అక్షయ తృతీయకు బంగారం కొనడం శుభసూచకంగా భావిస్తారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి వస్తోంది. మరి బంగారం కొనుగోళ్లలో సెంటిమెంట్‌ కలిసొస్తుందా? అక్షయ తృతీయపై గోల్డ్‌ రేటు పెరుగుదల ప్రభావం చూపిస్తుందా?

Akshaya Trithiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు శుభ సమయం ఇదే.. పూర్తి వివరాలు
Gold
Ravi Kiran
|

Updated on: Apr 29, 2025 | 7:05 PM

Share

బంగారం కొనుగోళ్లకు శుభసూచకంగా భావించే అక్షయ తృతీయ వచ్చేసింది. కాసేపట్లో అక్షయ తృతీయ తిథి ప్రారంభం కాబోతోంది. వివిధ రకాల శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ రేపు అయినప్పటికీ.. తిథి ప్రారంభం మాత్రం కాసేపట్లో.. అంటే.. 5గంటల 32 నిమిషాలకు మొదలు కానుంది. ఈ లెక్కన రేపు మధ్యాహ్నం 2గంటల 15నిమిషాలకు వరకు అక్షయ తృతీయ కొనసాగనుంది. దీంతో ఉదయం 5.32 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల మధ్యలో ఎప్పుడైనా బంగారం కొనొచ్చు. అయితే.. తిథి ఎప్పుడు ప్రారంభమైనా.. శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయను రేపే జరుపుకోనున్నారు.

వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ తిథిని అక్షయ తృతీయగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున పవిత్ర కార్యాలు, దానాలు, పూజలు, హోమాలు లాంటివి నిర్వహిస్తే శాశ్వతమైన ఫలితాలు ఇస్తుంటాయని పండితులు చెప్తుంటారు. బంగారు కొనుగోళ్లతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం శుభప్రదంతోపాటు.. శాశ్వతమైన సంపద చేకూరుతుందని భావిస్తారు. అందుకే.. ఈ శుభ దినాన బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ.. ఈ సారి.. అక్షయ తృతీయకు.. రోహిణి నక్షత్రం కూడా కలిసి రావడాన్ని మరింత పవిత్ర దినంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సారి బంగారం కొనుగోళ్లు ఎలా ఉంటాయనేది ఇంట్రస్టింగ్‌గా మారుతోంది.

ఇదిలావుంటే.. గోల్డ్‌ కొనుగోళ్లకు కేరాఫ్‌ అయిన అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరగడం షాకిస్తోంది. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. మళ్లీ పరుగు పెడుతోంది. వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం రేటు.. ఇవాళ స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్స్‌ బంగారం ధర 490 రూపాయలు పెరగడంతో పది గ్రాముల గోల్డ్‌ రేటు 98వేల 900 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్‌ బంగారం ధర 450 రూపాయలు పెరిగి.. 91వేల 580 రూపాయలకు చేరింది. ఇక.. అక్షయ తృతీయ నాటికి బంగారం ధర మరింత తగ్గుతుందని భావించిన కొనుగోలుదారులకు పసిడి ధర పెరుగుదలతో నిరాశ ఎదురవుతోంది.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?