AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 12 మందితో ప్రేమాయణం.. 49 ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిన హీరోయిన్.. ఇప్పుడు..

సినీరంగంలోని సెలబ్రెటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నటీనటుల ప్రేమాయణం, రిలేషన్ షిప్, పెళ్లి గురించి సెర్చ్ చేస్తుంటారు. అలాగే స్టార్స్ ఎక్కడికి వెళ్తారు అనేది ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కెరీర్, సినీప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

Tollywood: 12 మందితో ప్రేమాయణం.. 49 ఏళ్ల వయసులో ఒంటరిగా మిగిలిన హీరోయిన్.. ఇప్పుడు..
Sushmitha Sen
Rajitha Chanti
|

Updated on: Apr 29, 2025 | 8:42 PM

Share

బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచానికి అందరూ ఆకర్షితులవుతారు. ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటీనటులకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు నెటిజన్స్. అయితే కొందరు సెలబ్రెటీస్ మాత్రం తమ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. తమ అభిమాన హీరోహీరోయిన్స్ ఎవరితో డేటింగ్ చేస్తున్నారు.. ? ఎక్కడికి వెళ్తారు అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ గురించి నెట్టింట ట్రెండ్ అవుతుంటారు. 49 ఏళ్ల వయసులో కూడా ఆమె ఒంటరిగా ఉన్నప్పటికీ, ఆమె అందం, ఫిట్‌నెస్ కారణంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను ఇప్పటికీ శాసిస్తోంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్. నవంబర్ 19, 1975న హైదరాబాద్‌ జన్మించింది. 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఆమె.

ఆ తర్వాత 1996లో దస్తక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. నటనతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో నిలుస్తుంది. ఆమె పేరు 12 మంది హీరోలతో ముడిపడి ఉంది. ఇందులో విక్రమ్ భట్, రోహ్మాన్ షాల్, రణదీప్ హుడా, లలిత్ మోడీ, వసీం అక్రమ్ వంటి అనేక మంది పెద్ద పేర్లు ఉన్నాయి. అయితే ఇప్పటికీ సుష్మితా ఎవరినీ వివాహం చేసుకోలేదు. సుష్మితా సేన్ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకుంది. అలాగే రెనే, అలిసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది.

సుష్మిత నేడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన వర్కౌట్ వీడియోలు, స్టైలిష్ ఫోటోషూట్‌లు తన కూతుర్లతో గడిపే క్షణాలను షేర్ చేస్తుంటుంది. హిందీతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us