Mamitha Baiju: ఆ ఇద్దరు హీరోలంటే పిచ్చి.. ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన ప్రేమలు హీరోయిన్..
ప్రేమలు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫేమస్ అయిన హీరోయిన్ మమితా బైజు. మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తెలుగులో విపరీతమైన పాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు తమిళంతోపాటు తెలుగులోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ బ్యూటీ గురించి తెలుసుకుందామా.
Updated on: Apr 13, 2025 | 10:05 PM

మమితా బైజు.. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది. ప్రేమలు మూవీతో కుర్రకారుకు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. మమితా తండ్రి బైజు కృష్ణన్ డాక్టర్.. త్లిల హోమ్ మేకర్. 16 ఏళ్ల వయసులోనే సర్వోపకారి పాలక్కారన్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

సైకాలజీ చదువుతూ మధ్యలోనే ఆపేసింది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మమితా బైజు. మాస్ మహారాజా రవితేజ సరసన నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ప్రేమలు సినిమాకు రూ.30 లక్షలు పారితోషికం తీసుకుందట మమితా... ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ రూ.50 లక్షలు చేసిందని సమాచారం. అలాగే ఇప్పుడు తమిళంలో ఆఫర్స్ అందుకుంటుంది మమితా.

అలాగే తన ఫస్ట్ క్రష్ అంటే ఇద్దరు హీరోలు ఉంటారని తెలిపింది మమితా. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. వీరిద్దరే తన ఫస్ట్ క్రష్ అని తెలిపింది. ఇప్పుడు విజయ్ దళపతి చిత్రంలో నటిస్తుంది.

డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యింది. కానీ మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది. బాల కొట్టడం వల్లే మమితా ఆ సినిమా నుంచి తప్పుకుందని టాక్ రాగా.. పర్సనల్ రీజన్స్ అని తెలిపింది మమితా.





























