Viral News: స్పైడర్‌మాన్‌ పుస్తకంలోని ఓ పేజీ.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులు, ప్రముఖులకు చెందిన నవలలు, పుస్తకాలు వేలంలో అత్యధిక ధర పలకడం మీరు...

Viral News: స్పైడర్‌మాన్‌ పుస్తకంలోని ఓ పేజీ.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
Spiderman
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 18, 2022 | 1:06 PM

సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులు, ప్రముఖులకు చెందిన నవలలు, పుస్తకాలు వేలంలో అత్యధిక ధర పలకడం మీరు చూసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా పుస్తకంలోని ఓ పేజీ కోట్ల ధరకు అమ్ముడవడం చూశారా.! అయితే ఈ స్టోరీ చదవండి.. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

వివరాల్లోకి వెళ్తే.. 1984 నాటి స్పైడర్ మాన్ కామిక్ బుక్‌లోని 25వ పేజీ.. వేలంలో ఏకంగా రూ. 24 కోట్లు పలికింది. 1962 నాటి ప్రచురణతో కామిక్ ప్రపంచంలో స్పైడర్ మాన్ అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో పాత్రగా నిలిచింది. స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే ఈ పాత్రను సృష్టించారు. స్పైడర్ మాన్ పాత్ర చుట్టూ ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, యానిమేటెడ్ మూవీస్ వచ్చాయి.

అలాగే గతేడాది డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ‘స్పైడర్ మాన్: నో వే హోమ్’ ప్రపంచ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు ఉన్నా.. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇటు 1984 నాటి స్పైడర్ మాన్ కామిక్‌లోని సింగిల్ పేజీ ఏకంగా ఇంత ధర పలకడంతో మరోసారి స్పైడర్ మాన్ పాత్రకు ఉన్న క్రేజ్ గురించి చెప్పకనే చెబుతోంది.