AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid – Protien: కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ప్రోటీన్ ఫుడ్ తప్పనిసరి.. ఎందకంటే..

Covid - Protien: కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత శరీరం బలహీనంగా మారుతుంది. అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది.

Covid - Protien: కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ప్రోటీన్ ఫుడ్ తప్పనిసరి.. ఎందకంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 18, 2022 | 11:33 AM

Share

Covid – Protien: కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత శరీరం బలహీనంగా మారుతుంది. అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. బాడీ పెయిన్స్ వేధిస్తుంటాయి. అయితే, ఈ సమస్యను అధిగమించడానికి వైద్యులు ప్రోటీన్‌తో కూడిన పదార్థాలను తినాలని సిఫార్సు చేస్తారు. ఇన్ఫెక్షన్ తర్వాత శరీరంలోని అనేక లోపాలను భర్తీ చేయడానికి ప్రోటీన్ సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. నిజమే.. ప్రోటీన్స్ అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తాయి. శరీరంలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి ప్రోటీన్ చాలా అవసరం.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలామంది ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. అదే సమయంలో కోలుకుంటున్నారు కూడా. ఇలాంటి సమయంలో ప్రోటీన్స్ వ్యక్తులకు చాలా ముఖ్యం. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సురభి పరీక్ మాట్లాడుతూ, కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో శరీరంలోని కండరాలు బలహీనపడతాయి. రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆహారంలో ప్రోటీన్ తీసుకోవడం అవసరం.

నిపుణుల ప్రకారం.. రికవరీ సమయంలో ప్రోటీన్ ఎంత ముఖ్యం, అది ఎలా పని చేస్తుంది, ఆహారంలో ఏం తీసుకోవాలి అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

కోవిడ్ సోకిన తరువాత ప్రోటీన్స్ విధి ఏంటి? కోవిడ్ పాజిటివ్ సమయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చాలా కాలం పాటు వైరస్‌తో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మీరు చాలా రోజులపాటు వైరస్ బారిన పడినట్లయితే.. శరీరంలో విపరీతమైన బలహీనత ఉంటుంది. కరోనాతో సుదీర్ఘ పోరాటం తర్వాత, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. యాంటీబాడీల సంఖ్య తగ్గుతుంది. అయితే, శరీరంలో ఉండే ప్రోటీన్.. తగినంత మొత్తంలో ప్రతిరోధకాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, శరీరంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచడానికి రోగనిరోధక శక్తి అవసరం. ఇది ప్రోటీన్తో సాధ్యమవుతుంది.

ప్రోటీన్స్ ఉపయోగాలు.. 1. శరీర కండరాలను బలోపేతం చేయడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దాని కండరాల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రోటీన్ సహాయంతో, కండరాల సంకోచం, వ్యాకోచం చెందే సామర్థ్యం మెరగవుతుంది. 2. శరీరంలో కొత్త కణాలను తయారు చేయడంతోపాటు వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రొటీన్ సహాయపడుతుంది. శరీరం మిలియన్ల కణాలతో రూపొందించబడింది. ఆ కణాజాలం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్స్ కీలకం. 3. శరీరంలో తగినంత శక్తి, రక్తంలో ఆక్సిజన్ ఉండటం ముఖ్యం. ఈ రెండు విధులకు ప్రోటీన్ ముఖ్యమైనది. ఇది కాకుండా, DNA, RNA ని నియంత్రిస్తుంది.

ఎంత ప్రోటీన్ అవసరం? ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది వ్యక్తి అవసరాన్ని బట్టి ఉంటుంది. అంటే.. ఒక వ్యక్తి బరువు ఎంత ఉంటే.. అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు, మీ బరువు 60 కిలోలు ఉంటే, ఒక రోజులో మీరు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవచ్చు. ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. ఎక్కువ ప్రోటీన్స్ అవసరం అవుతాయి. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రోటీన్ కోసం ఏం తినాలి.. శాఖాహారం: పాలు, పాల ఉత్పత్తులు, పప్పులు, బాదం, పనీర్, బ్రోకలీ, మొలకలు, మొదలైనవి. మాంసాహారం: గుడ్డు, చేపలు, చికెన్, ఎండ్రకాయలు మొదలైనవి.

Also read:

TOP 9 NEWS: వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి | ఇంగ్లీష్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. లైవ్ వీడియో

Pushpa: తగ్గేదేలే.. ఇదెక్కడి మాస్ మావా.! పుష్పరాజ్ ను వాడేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌