Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌

Gas Cylinder: రోజువారీగా ఉపయోగపడేది గ్యాస్‌ సిలిండర్‌. కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వారు కూడా ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్లను...

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌
Gas Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2022 | 8:36 AM

Gas Cylinder: రోజువారీగా ఉపయోగపడేది గ్యాస్‌ సిలిండర్‌. కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వారు కూడా ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్లను వాడుతున్నారు. గ్యాస్‌ సిలిండర్లకోసం ఆయా గ్యాస్ కంపెనీలు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. ఇక తాజాగా వినియోగదారులకు శుభవార్త అందింది. ఒక్క గ్యాస్‌ సిలిండరర్‌ ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేక తత్కాల్‌ సేవ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండేన్‌ గ్యాస్‌ కంపెనీ. ఇందులో భాగంగా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్ సరఫరా చేయనున్నట్లు కంపెనీ జనరల్ మేనేజర్ వి.వెట్రీ సెల్వకుమార్ వెల్లడించారు. అయితే తత్కాల్ సేవ సౌకర్యం వినియోగించుకున్న కస్టమర్లు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సౌకర్యం కోసం ఫోన్‌ లేదా ఇండేన్‌ ఆయిల్‌వన్‌ యాప్‌, https://cx.indianoil.in వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా మొత్తం 62 ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్ల వద్ద సదుపాయం అందుబాటులో ఉందని వెల్లడించారు.

తక్కువ ధరకే ఈ సిలిండర్‌ను అందిస్తోంది ఇండేన్‌ సంస్థ. ఇది సాధారణ సిలిండర్‌ కాదు.. మామూలు గ్యాస్‌ సిలిండర్‌ కంటే బరువు తక్కువగా ఉంటుంది. దీనిపై ప్లాస్టిక్‌ లాంటి పరికరం ఉండటంతో సిలిండర్‌ తుప్పు పట్టే అవకాశం ఉండదు. ఈ కాంపోజిట్ సిలిండర్ కోసం కేవలం రూ.633.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 10 కిలోల గ్యాస్‌ ఉంటుంది. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌ ఇంటికి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Amazon, Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లు.. పలు ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌

PPF Scheme: పీపీఎఫ్‌ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ప్రతి నెల రూ.1000 డిపాజిట్‌తో చేతికి రూ.12 లక్షలు.. పూర్తి వివరాలు