Bank Charges: మీకు ఆ బ్యాంకులో అకౌంట్ ఉందా…? ఛార్జీల మోత.. తెలుసుకోండి పూర్తి వివరాలు..!
Bank Charges: ప్రస్తుతం బ్యాంకులకు కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత మోగిస్తున్నాయి. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు, ఇతర లావాదేవీలపై ఛార్జీల..
Bank Charges: ప్రస్తుతం బ్యాంకులకు కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత మోగిస్తున్నాయి. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు, ఇతర లావాదేవీలపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తన కస్టమర్లకు అందించే వివిధ రకాల సేవలపై ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచే అమల్లోకి వచ్చాయి. నీస బ్యాలెన్స్, లాకర్ ఛార్జీలు, డిపాజిట్ ఛార్జీలు వంటివి పెంచింది బ్యాంకు.
బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే..
బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేనట్లయితే ఛార్జీలు విధిస్తోంది. మూడు నెలలకు సగటున బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ రూ.10వేలకు పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.5వేలు ఉంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వారికి విధించే రూ.200 ఉన్న ఛార్జీని రూ.400లకు పెంచింది. ఇక అర్బన్, మెట్రో ప్రాంతాల వారికి రూ.300 ఉన్న ఛార్జీని రూ.600లకు పెంచుతున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది.
బ్యాంక్ లాకర్ ఛార్జీలు:
ఇక బ్యాంక్ లాకర్ ఛార్జీల విషయానికొస్తే.. గ్రామీణ, మెట్రో అన్ని ప్రాంతాల వారికి బ్యాంకు లాకర్ అద్దె ఛార్జీలను పెంచింది. ఇంతకు ముందు చెల్లించే బ్యాంకు లాకర్ అద్దె రూ.500 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు లాకర్ ఛార్జీలను పెంచడంతో పాటు ఏడాదిలో బ్యాంక్ లాకర్ ఉచిత విజిట్స్‌ను 12కు తగ్గించింది. ఇంతకుముందు సంవత్సరానికి 15 సార్లు ఉచితంగా లాకర్ తెరిచే సదుపాయం ఉండేది. ఆ ఉచిత సదుపాయానికి మించి విజిట్ చేసినట్లయితే ఒక్కో విజిట్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
నగదు డిపాజిట్ ఛార్జీలు
ఇక నగదు డిపాజిట్ ఛార్జీల పరిమితిని తగ్గించింది. రోజువారీ ఉచిత డిపాజిట్ లిమిట్ ప్రస్తుతం రూ.2 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ. 1 లక్ష ఉంది.
సేవింగ్స్ అకౌంట్ల లావాదేవీలపై..
ఇక సేవింగ్స్ అకౌంట్ల లావాదేవీలపై జనవరరి 15నుంచి మూడు ఉచిత లావాదేవీలను పీఎన్‌బీ అనుమతి ఇస్తుంది. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.50 ఛార్జ్ చేస్తారు. ఇక సీనియర్ సిటిజన్స్ అకౌంట్లకు ఇది వర్తించదు. ఇప్పుడు బ్యాంకు బేస్, నాన్‌బేస్ బ్రాంచ్‌లకు ప్రస్తుతం 5 ఉచిత లావాదేవీలకు అనుమతి ఇస్తుంది. తర్వాత ఆపై చేసే లావాదేవీకి రూ.25 ఛార్జీ వసూలు చేస్తుంది.
కరెంటు అకౌంట్ క్లోజర్ ఛార్జీలు:
బ్యాంకు కరెంట్ అకౌంట్ క్లోజర్‌కు ఛార్జీలు విధిస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల తర్వాత ఖాతాను క్లోజ్ చేసుకున్నట్లయితే రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు 600 ఉండేది. ఇప్పుడు దానిని పెం చేసింది. అయితే కరెంటు అకౌంట్ తెరిచిన 12 నెలల తరువాత రద్దు చేసుకున్నట్లయితే ఎలాంటి ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి: