AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon, Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లు.. పలు ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌

Amazon, Flipkart: ఈకామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ మరోసారి భారీ ఆఫర్లతో కస్టమర్ల ముందుకొచ్చాయి. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌తో..

Amazon, Flipkart: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లు.. పలు ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌
Subhash Goud
|

Updated on: Jan 18, 2022 | 8:52 AM

Share

Amazon, Flipkart: ఈకామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ మరోసారి భారీ ఆఫర్లతో కస్టమర్ల ముందుకొచ్చాయి. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌తో పలు ప్రొడక్ట్ లపై ఆఫర్లను ప్రకటించగా, ఇక బిగ్‌ సేవింగ్‌ డే పేరుతో పేరుతో ఫ్లిప్‌కార్టు కూడా అనేక రకాల ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా కొన్ని వస్తువులపై 80 శాతం, కొన్ని వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నాయి. ఈ ఆఫర్లలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌, ఇతర గృహోపకరణలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. గరిష్టంగా 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

స్మార్ట్ టీవీలు:

ఎంఐ స్మార్ట్‌ టీవీలపై కూడా మంచి ఆఫర్‌ ప్రకటించాయి. ఎంఐ4ఎక్స్‌ 43 ఇంచ్‌ల అల్ట్రా హెచ్‌డీ టీవీ రూ.29,999లకే లభ్యమవుతుంది. అలాగే శాంసంగ్‌ క్రిస్టల్‌ 4కే 43 ఇంచ్‌ల టీవీ రూ.36,999 లభ్యమవుతుంది. రియల్‌ మీ, వీయూ ప్రీమియం స్మార్ట్‌ టీవీలు కూడా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

స్ట్రీమింగ్ ప్రొడక్ట్స్:

అదేవిధంగా ప్రస్తుత టీవీని అప్ డేట్‌ చేయాలనుకుంటే బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు హెచ్‌డీఎంఐ పోర్ట్ లేదా యూఎస్‌బీ పోర్ట్ ద్వారా హార్డ్‌వేర్‌ను మీ టీవీకి కనెక్ట్ చేయవచ్చు.

ఇక ఎంఐ బాక్స్‌ 4కే మీడియా స్ట్రీమింగ్‌ ధర రూ.3,499, ఇంట్నల్‌ క్రోమాకాస్ట్‌తో నోకియా మీడియా స్ట్రీమింగ్‌ ధర రూ.2,999 ఉంది. రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్‌టీవీ స్టిక్ ధర రూ. 3,499 ఉంది. అలాగే యాపిల్ టీవీ4కే32 జీబీ ధర రూ.17,999 ఉంది.

స్మార్ట్‌ ఫోన్‌ల ధరలు:

ఇక స్మార్ట్‌ ఫోన్‌ల ధరలు తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా యాపిల్‌, మోటరోలా, వీవో, ఎంఐ తదితర స్మార్ట్‌ ఫోన్‌లు ఆఫర్లలు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.

యాపిల్‌ ఐఫోన్ 12మినీ 64 జీబీ ధర రూ.41,999 ఉండగా, మోటరోలా జీ60 128జీబీ ధర రూ.17,999 ఉంది. అలాగే మి11 లైట్‌ 128జీబీ ధరర రూ.23,999కే లభ్యమవుతోంది. వివో ఎక్స్‌60 (128జీబీ) ధర రూ.34,990 ఉంది.

ఇవి కూడా చదవండి:

PPF Scheme: పీపీఎఫ్‌ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ప్రతి నెల రూ.1000 డిపాజిట్‌తో చేతికి రూ.12 లక్షలు.. పూర్తి వివరాలు

e-Shram Registration: 20 కోట్లకు చేరుకున్న ఇశ్రమ్ రిజిస్ట్రేషన్స్‌.. రూ.2 లక్షల బీమా.. నిబంధనలు పాటించకుంటే రద్దు