Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు..!

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు. అవును, క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు..

Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు..!
Petrol Diesel Rates Today
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 18, 2022 | 8:25 AM

Petrol-Diesel Rates Today: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇందిలావుంటే.. రాష్ట్రాల్లో కూడా చమురు ధరల్లో పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను ఆదివారం తాజాగా విడుదల చేసింది. దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో కొద్దిగా తగ్గినట్లుగా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి వెబ్ సైట్ ప్రకారం

ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు. అవును, క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. ఆ కోణంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రతిరోజూ పెంచవచ్చు. కానీ, ప్రస్తుతం దేశంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతూనే మరోవైపు 76 రోజులుగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.93గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.28గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.05గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.33 ఉండగా.. డీజిల్ ధర రూ.94.74గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.88పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.31గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.29కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.44లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.44గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.42లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.23గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.33గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.37లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.50 ఉండగా.. డీజిల్ ధర రూ.91.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

ఇప్పుడు మీ ఫోన్ వాకీ టాకీ మార్చుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..