e-Shram Registration: 20 కోట్లకు చేరుకున్న ఇశ్రమ్ రిజిస్ట్రేషన్స్‌.. రూ.2 లక్షల బీమా.. నిబంధనలు పాటించకుంటే రద్దు

e-Shram Registration: మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్‌ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు

e-Shram Registration: 20 కోట్లకు చేరుకున్న ఇశ్రమ్ రిజిస్ట్రేషన్స్‌.. రూ.2 లక్షల బీమా.. నిబంధనలు పాటించకుంటే రద్దు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 17, 2022 | 1:29 PM

e-Shram Registration: మోడీ సర్కార్‌ ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కీమ్‌ వల్ల వివిధ వర్గాల వారికి ఎంతో మేలు కలిగిస్తున్నాయి. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. మోదీ సర్కార్ ఇశ్రమ్ వెబ్‌సైట్ తీసుకువచ్చింది. అసంఘటిత కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. పేరు నమోదు చేసుకున్న వారికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు 20 కోట్ల అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు ఈ-శ్రమ్‌ ప్లాట్‌ఫామ్‌ తెలిపింది. దీనిని సెప్టెంబర్‌ 2021లో ప్రారంభించారు. అసంఘటి రంగానికి చెందిన 16 నుంచి 56 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

వివరాలు సరిగ్గా లేకుంటే కార్డు రద్దు..

కాగా, ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వారు పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది. పాన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు అందించాలి. ఒకవేళ వివరాలు సరిగ్గా లేనట్లయితే రిజిస్టేషన్‌ రద్దు అవుతుంది.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఎలా..?

ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. దీని తరువాత మీరు ఆధార్‌తో లింక్ చేయబడిన నెంబర్‌తో ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆధార్ నెంబర్‌ను నమోదు చేసి ఓటీపీ ద్వారా ప్రక్రియను కొనసాగించాలి. మీ సమాచారం తెరపైకి వస్తుంది. మీరు దానిని అంగీకరించాలి.

మీరు సులభంగానే ఇశ్రమ్ పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ కావచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి ఉంటే సరిపోతుంది. సులభంగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూఏఎన్ నెంబర్ వస్తుంది.

తాజాగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి:

Pension Increase: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. నెలవారీ పెన్షన్‌ రూ.9000కు పెరగనుందా..?

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?