Pension Increase: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. నెలవారీ పెన్షన్‌ రూ.9000కు పెరగనుందా..?

Pension Increase: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సబ్‌స్క్రైబర్‌ల కోసం భరీ ప్రయోజనంతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది...

Pension Increase: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. నెలవారీ పెన్షన్‌ రూ.9000కు పెరగనుందా..?
Follow us
Subhash Goud

|

Updated on: Jan 17, 2022 | 10:18 AM

Pension Increase: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సబ్‌స్క్రైబర్‌ల కోసం భరీ ప్రయోజనంతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో లబ్ధిదారులకు కనీస పింఛను పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఫిబ్రవరిలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సమావేశం జరగనుంది. సమావేశంలో పీఎఫ్‌ సబ్‌స్క్రైబర్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ లేదా ఈపీఎస్‌ (EPS) కింద కనీస పెన్షన్‌ను పెంచడం, ఇందులో కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.1,000 నుండి రూ.9,000కి పెంచడం అనేది సమావేశం ఎజెండా. అయితే ఈ విషయమై పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై అనేకమార్లు చర్చలు జరిగాయి.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త వేతన నియమావళి అమలు, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ వంటి రెండు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మార్చి 2021లో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000 నుండి రూ.3,000కి పెంచాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే పింఛను మొత్తాన్ని కనీసం రూ.9వేలకు పెంచాలన్నది పింఛనుదారుల డిమాండ్. పదవీ విరమణకు ముందు ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం ప్రకారం పెన్షన్‌ను నిర్ణయించాలని సూచన ఉన్నట్లు తెలుస్తోంది. కార్మిక మంత్రిత్వ శాఖ సమావేశంలో కూడా ఈ సూచనను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!

EPFO: ఫించన్‌దారులకు ఈపీఓఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు..!