White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!

White Label ATM: భారత్‌లో రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. బ్యాంకింగ్..

White Label ATM: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. రానున్న రోజుల్లో 20 వేలకుపైగా కొత్త ఏటీఎంల ఏర్పాటు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 17, 2022 | 10:00 AM

White Label ATM: భారత్‌లో రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. నగదు విత్‌డ్రా, ఇతర సేవలు పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలు అందించనుంది. ఇండియా1 పేమెంట్స్ లిమిటెడ్.. సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లోని కస్టమర్‌లకు నగదు అందించడానికి వచ్చే నాలుగైదు ఏళ్లలో 20,000 ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) కే శ్రీనివాస్‌ ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ ప్రతి నెలా 300-400 ATMలను ఇన్‌స్టాల్ చేస్తోందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ ) ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెంపుతో పాటు నగదు ఉపసంహరణ పెరుగుదల, ఇతర కారణాల వల్ల దేశంలో వైట్‌ లేబుల్ ఏటీఎంలను ఏర్పాటు వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు.

బెంగళూరుకు చెందిన కంపెనీ ప్రస్తుతం ‘ఇండియా1 ATM’ ఏటీఎంల ఏర్పాటును వేగవంతం చేస్తోంది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తర్వాత ఇది రెండవ అతిపెద్ద ATM బ్రాండ్. నాన్-బ్యాంకింగ్ సంస్థ ద్వారా వ్యవస్థాపించబడింది. ఇలాంటి ఏటీఎం యంత్రాలను వైట్ లేబుల్ ATM (WLA) అంటారు. 2021 సంవత్సరంలో 3000పైగా ఏటీఎంలను ఏర్పాటు చేసిందని, సెమీ-అర్బన్ మరియు గ్రామీణ భారతదేశంలో ATMల ప్రవేశం తక్కువగా ఉన్నందున వచ్చే 4-5 సంవత్సరాలలో అదే వేగంతో వృద్ధి చెందుతుందని శ్రీనివాస్ PTI కి చెప్పారు. ఆ విధంగా ఇండియా1 20,000 కంటే ఎక్కువ ATMలతో భారీ ATM నెట్‌వర్క్‌గా మారడానికి సిద్ధంగా ఉంది.

ఈ రాష్ట్రాలపై దృష్టి..

ఏటీఎం లభ్యత తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలపై తమ దృష్టి కొనసాగుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ATMల ద్వారా నగదు లభ్యతను నిర్ధారించడంపై కంపెనీ దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుడు కనీసం 8-9 కిలోమీటర్లు ప్రయాణించి మన ఏటీఎం వద్దకు వచ్చినప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని గమనించాలన్నారు.

ప్రస్తుతం కంపెనీ ఉనికి లేని ఈశాన్య ప్రాంతంలో ఏటీఎంల ఏర్పాటును వచ్చే ఏడాది పరిశీలించవచ్చని శ్రీనివాస్ తెలిపారు. దేశంలోని సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో మా ATM సేవలను చేరుకోవడం ద్వారా ఆర్థిక చేరికను మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాం అని అన్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం.. సెప్టెంబర్‌ వరకు దేశంలో 2.4 లక్షల ATMలు ఉన్నాయి. వీటిలో దాదాపు 28,000 వైట్ లేబుల్ ATMలు ఉన్నాయి. కంపెనీ గత సంవత్సరంతో పోలిస్తే 15 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఈ సమయంలో ATMలు 50 శాతానికి పైగా అందించింది. ఇది 72 మిలియన్లకు పైగా కస్టమర్ లావాదేవీలకు సేవలు అందిస్తుంది. ప్రతి త్రైమాసికంలో సగటున రూ. 13,600 కోట్లకు పైగా స్థూల లావాదేవీల విలువను సులభతరం చేస్తుంది.

వైట్‌ లేబుల్‌ ఏటీఎంలు అంటే ఏమిటి..?

సాధారణంగా వైట్ లేబుల్‌ ఏటీఎంలను (WLA)లను బ్యాకింగేతర సంస్థలు నిర్వహిస్తాయి. ఖాతాదారులు ఈ యంత్రాలను సాధారణ ఏటీఎంల మాదిరిగానే పని చేస్తాయి. విత్‌డ్రా, ఇతర డెబిట్‌ కార్డు సేలను వీటి ద్వారా పొందవచ్చు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకింగేత సంస్థలు కూడా ఏటీఎంలను నిర్వహించేందుకు ఆర్బీఐ పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్‌ సిస్టం చట్టం-2007 కింద అనుమతి ఇచ్చింది. ఇండియా 1 పేమమెంట్స్‌ లిమిటెడ్‌, ఇతర సంస్థలు ఈ విధంగా దేశంలో వైట్‌లేబుల్‌ ఏటీఎం సేవలను అందిస్తున్నాయి.

వైట్‌ లేబుల్‌ ఏటీఎంల ఉపయోగం ఏమిటి..?

సాధధాణంగా బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. బ్యాంకు బ్రాంచ్‌లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్‌ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైట్‌ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా, ఖాతాకు సంబంధించిన సమాచారం, నగదు డిపాజిట్‌, బిల్లుల చెల్లింపు, అకౌంట్‌ మినీ స్టేట్‌మెంట్ , పిన్‌ నెంబర్‌ను చేంజ్‌ చేసుకోవడం తదితర సేవలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

EPFO: ఫించన్‌దారులకు ఈపీఓఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు..!

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు