AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఫించన్‌దారులకు ఈపీఓఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు..!

EPFO: ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) ఫించన్‌దారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి ప్రతి నెలా చివరి..

EPFO: ఫించన్‌దారులకు ఈపీఓఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు..!
Subhash Goud
|

Updated on: Jan 17, 2022 | 8:24 AM

Share

EPFO: ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) ఫించన్‌దారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి ప్రతి నెలా చివరి రోజున ఆ నెలక సంబంధించి పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పీఎఫ్‌ కమిషనర్‌ విశాల్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్‌ పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలను జారీ చేయాలని పీఎఫ్‌ కార్యాలయాలకు సూచించారు. అయితే పెన్షన్‌ చెల్లించేందుకు కొన్ని బ్యాంకులతో ఈపీఎఫ్‌ఓ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో ప్రతి నెల10వ తేదీ నాటికి పెన్షన్‌ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కొన్ని బ్యాంకులు 7వ తేదీన జమ చేస్తున్నాయి.

మరి కొన్ని బ్యాంకులు 10వ తేదీ నాటికి ఖాతాల్లో జమ చేసేవి. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిబంధనల మేరకు గరిష్టంగా ప్రతినెల 5వ తేదీ వరకైనా పెన్షన్‌ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈపీఎఫ్‌ఓ నాలుగు సంవత్సరాల కిందటనే బ్యాంకులకు సూచించింది. అయితే రూరల్‌ పీఎఫ్‌ (PF) కార్యాలయాల నుంచి పెన్షన్‌ చెల్లింపు బిల్లులు సకాంలలో అందకపోవడంతో కొన్ని బ్యాంకులు గడువు తేదీ నాటికి ఖాతాల్లో జమ చేయడం లేదని, దీంతో పీఎఫ్‌ పెన్షన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఈపీఎఫ్‌ఓ దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన ఈపీఎఫ్‌ఓ ప్రతి నెల చివరి పనిదినం రోజున ఖాతాల్లో పెన్షన్‌ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పీఎఫ్‌ కార్యాలయాలకు సూచించింది.

ఇవి  కూడా చదవండి:

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!