Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!
Covid 19 Insurance: ఒకప్పుడు జీవిత బీమా పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెద్దగా ఉండేది కాదు. కానీ కరోనా వచ్చిన తర్వాత పాలసీలు..
Covid 19 Insurance: ఒకప్పుడు జీవిత బీమా పాలసీలు చేసుకునేవారి సంఖ్య పెద్దగా ఉండేది కాదు. కానీ కరోనా వచ్చిన తర్వాత పాలసీలు చేసుకునే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. కరోనా సోకినవారు, కొత్త బీమాపాలసీలు తీసుకోవడంలో కొంత కష్టంగా మారుతోంది. కరోనా వచ్చి కోలుకున్న తర్వాత నెగిటివ్ తేలితే మూడు నెలల తర్వాత బీమా పాలసీలను తీసుకుంటున్నాయి బీమా కంపెనీలు. బీమా పాలసీలు రకరకాల వ్యాధులకు వర్తింపజేస్తుండగా, ఇప్పుడు ఆ జాబితాలో కోవిడ్-19 కూడా చేరింది. టర్మ్ పాలసీలు జారీచేసేందుకు కూడా కొవిడ్ తగ్గిన 90 రోజుల వరకు వేచిచూడాల్సి ఉంటుంది. మీకు ఇటీవల కరోనా సోకితే, జీవిత బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు కనీసం 3 నెలలు వేచి ఉండాలి . మారుతున్న పరిస్థితుల్లో బీమా కంపెనీలు వెయిటింగ్ పీరియడ్ ను 3 నెలలు ఉంది. ఇతర అనారోగ్య సందర్భాల్లో కూడా రోగి కోలుకున్న తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆరోగ్య బీమా లేదా జీవిత బీమాను కొనుగోలు చేయడానికి 3 నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా లక్షల మంది చనిపోయారు. అటువంటి పరిస్థితిలో క్లెయిమ్‌లు కూడా భారీగా పెరిగాయి. డెత్ క్లెయిమ్‌ల పెరుగుదల కారణంగా బీమా కంపెనీలు తమ పాలసీ విధి విధానాలను మార్చుకున్నాయి. జీవిత బీమా సంస్థలు ఇప్పటికే టర్మ్ పాలసీల ప్రీమియాన్ని 15-20 శాతం పెంచాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు రూ.20 లక్షలు మించిన పాలసీలను రీఇన్సూరెన్స్ చేయిస్తాయి. క్లెయిమ్‌ల సంఖ్య పెగడంతో రీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక్కసారిగా ప్రీమియాన్ని పెంచేశాయి. ఈ భారాన్ని పాలసీదారులు మోయాల్సి ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మళ్లీ ఇన్సూరెన్స్ చేయాల్సి ఉంటుందని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ప్రొడక్ట్ హెడ్ కార్తీక్ రామన్ తెలిపారు. కరోనా కాలంలో బీమా కంపెనీల వ్యాపారం గణనీయంగా పెరిగింది. దీనితో పాటు క్లెయిమ్‌ల సంఖ్య కూడా భారీగానే పెరిగాయి.
మరణాల రేటును బట్టి వెయిటింగ్ పీరియడ్‌ని నిర్ణయిస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కరోనా సాధారణ వైరస్ కాదు. ఈ వైరస్ లక్షలాది మందిని బలి తీసుకుంది. ఈ వ్యాధిలో మరణాల రేటు నిరంతరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమా కంపెనీల ఆందోళన మరింత పెరిగింది. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్‌ని అమలు చేస్తున్నాయి బీమా కంపెనీలు. గత రెండేళ్లలో రీఇన్స్యూరెన్స్ కంపెనీల వ్యాపారం బాగా దెబ్బతిన్నది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీ-ఇన్సూరెన్స్ ప్రీమియంగా రూ. 442 కోట్లు డిపాజిట్ చేసింది. అంతకు ముందు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి రీ-ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియంగా రూ. 327 కోట్లు మాత్రమే ఉండగా, 2020-21లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కలిపి మొత్తం రూ.3909 కోట్లు డిపాజిట్ చేయగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.3074 కోట్లను ఉంది.
ఇవి కూడా చదవండి: