Budget 2022: వారిపై తగ్గనున్న పన్ను భారం.. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన?

Union Budget 2022: ఈ ఏడాది సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న జీతాలు అందుకునేవారితోపాటు పెన్షనర్‌లకు ప్రభుత్వం పెద్ద ఊరటనిస్తుందనే వార్తలు వస్తున్నాయి.

Budget 2022: వారిపై తగ్గనున్న పన్ను భారం.. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన?
Follow us

|

Updated on: Jan 24, 2022 | 10:55 PM

Union Budget 2022: ఈ ఏడాది సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌(Union Budget 2022)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం(High Inflation)తో ఇబ్బంది పడుతున్న జీతాలు అందుకునేవారితోపాటు పెన్షనర్‌లకు ప్రభుత్వం పెద్ద ఊరటనిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 1, 2022న సమర్పించే బడ్జెట్‌(Budget 2022)లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచుతారని, తద్వారా పన్ను చెల్లింపుదారుల(Tax payers)కు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పన్ను భారం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.75000 ఉండొచ్చని తెలుస్తోంది. అంటే, 50 శాతం వరకు పెంపు నేరుగా చేయవచ్చు అని అంటున్నారు. వాస్తవానికి, వ్యాపార ఛాంబర్‌లు కాకుండా, పన్ను చెల్లింపుదారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ఆర్థిక మంత్రిని పలువురు ఆర్థికవేత్తలు అభ్యర్థించారంట.

కరోనా మహమ్మారి (Covid-19) సమయంలో జీతాలు తీసుకునే వ్యక్తుల ఖర్చులు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి నుంచి ఆఫీసు పనిని చేయాల్సి ఉంటుంది. దీంతో జీతభత్యాలలో కరెంటు బిల్లు, ఇంటర్నెట్ ఖర్చులు పెరిగిపోయాయి. పిల్లలకు కూడా ఇంటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం వల్ల పన్ను చెల్లింపుదారుల ఖర్చులు మరింత పెరిగాయి.

ద్రవ్యోల్బణం పెరగడంతో మరిన్ని కష్టాలు..

కరోనా కారణంగా ఆరోగ్య సేవలపై ఖర్చులు కూడా పెరిగాయి . దీంతో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. పెట్రోలు, డీజిల్ నుంచి కూరగాయలు, నూనె, ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (LPG, PNG & CNG) ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అందువల్ల, ప్రస్తుత స్థాయి నుంచి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ఆర్థిక మంత్రికి విపరీతమైన డిమాండ్లు అందాయంట. కరోనా కాలంలో చాలా దేశాల్లో ఇంటి వద్ద కార్యాలయాలు ఏర్పరచుకోడానికి ఖర్చు పెరిగిన దృష్ట్యా, పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనిని భారతదేశంలో కూడా బడ్జెట్‌లో అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.

2018లో అమల్లోకి వచ్చిన స్టాండర్డ్ డిడక్షన్.. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయంలో రూ. 50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ సదుపాయం ఉంది. 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.40,000గా ఉండగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఈ పరిమితిని రూ.50,000లకు పెంచారు.

Also Read: Budget 2022 Date: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణ

Budget 2022: పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం..వర్క్ ఫ్రమ్ హోమ్ పై బడ్జెట్‌కు ముందు కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు