- Telugu News Photo Gallery Business photos Sankranthi big c offers.. Offer and discount on Smart TVs, smart phones
Big C Offers: స్మార్ట్‌టీవీలు, మొబైళ్లపై బిగ్ సి అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్
Big C Offers: సంక్రాంతి పండగ సందర్బంగా వివిధ వస్తువుల కొనుగోళ్లపై ఎన్నో ఆఫర్లు ఉంటాయి. ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు బిగ్ సి వంటివి ప్రత్యేక ఆఫర్లు ..
Updated on: Jan 15, 2022 | 6:43 PM

Big C Offers: సంక్రాంతి పండగ సందర్బంగా వివిధ వస్తువుల కొనుగోళ్లపై ఎన్నో ఆఫర్లు ఉంటాయి. ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు బిగ్ సి వంటివి ప్రత్యేక ఆఫర్లు పెడుతుంటాయి. ఇక ల్యాప్‌టాప్ కొనుగోలుపై బిగ్ సి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది

మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు బిగ్ సి సీఎండీ ఆలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపారు.

దీంతోపాటు వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభమైన వాయిదాల పద్దతుల్లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు.

ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుందని, స్మార్ట్ టీవీలపై రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్ అందజేస్తున్నామని తెలిపారు. అలాగే సాంసంగ్ ఫోన్‌లపై రూ.7 వేల వరకు క్యాష్‌బ్యాక్, వన్ ప్లస్ మొబైళ్లపై రూ.8 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.




