Inequality Kills: మన దేశంలో 10 శాతం ధనవంతుల వద్ద ఉన్న డబ్బు ఎంతో తెలుసా? ఈ లెక్కలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
కరోనా మహమ్మారి సమయంలో, ఒక వైపు దేశంలో పేద ప్రజల ముందు ఆహారం .. పానీయాల సంక్షోభం ఉంటే, మరోవైపు, ఈ కాలంలో దేశంలో ధనవంతుల సంఖ్య పెరిగింది.
Inequality Kills: కరోనా మహమ్మారి సమయంలో, ఒక వైపు దేశంలో పేద ప్రజల ముందు ఆహారం .. పానీయాల సంక్షోభం ఉంటే, మరోవైపు, ఈ కాలంలో దేశంలో ధనవంతుల సంఖ్య పెరిగింది. ఎన్జీవో( NGO)ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 2021లో 102 నుంచి 142కి పెరిగింది. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 మొదటి రోజు. ఈ సందర్భంగా ఆక్స్‌ఫామ్ ఇండియా(OX FAM India) వార్షిక అసమానత సర్వేను విడుదల చేసింది. దీని ప్రకారం, కరోనా కాలంలో భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రెట్టింపు అయింది. టాప్-10 మంది ధనవంతులు ఎంత సంపాదన కలిగి ఉన్నారో తెలిస్తే అదిరిపోతారు. దేశంలోని అన్ని పాఠశాలలు .. కళాశాలలను రాబోయే 25 సంవత్సరాల పాటు నిర్వహించగలిగేంత సంపదను మన దేశంలోని టాప్ 10 మంది ధనవంతులు కలిగివున్నారని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక చెబుతోంది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం.
45% డబ్బు కేవలం 10% మంది దగ్గర మాత్రమే..
కరోనా కారణంగా అసమానతలు చాలా పెరిగాయి, దేశంలోని 10% సంపన్నుల వద్ద దేశ సంపదలో 45% ఉంది. అదే సమయంలో, దేశంలోని 50% పేద జనాభా వద్ద కేవలం 6% సంపద మాత్రమే ఉంది.
1% పన్నుతో 17.7 లక్షల అదనపు ఆక్సిజన్ సిలిండర్లు..
భారతదేశంలోని టాప్-10% సంపన్నులపై 1% అదనపు పన్ను విధిస్తే, ఆ డబ్బు నుంచి దేశం 17.7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లను అదనంగా పొందుతుందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో దేశంలోని 98 సంపన్న కుటుంబాలపై 1% అదనపు పన్ను విధిస్తే, ఆ డబ్బుతో వచ్చే ఏడేళ్లపాటు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ అనే విషయం తెలిసిందే.
ఈ ఆర్థిక అసమానత నివేదిక ప్రకారం, దేశంలోని 142 మంది బిలియనీర్ల మొత్తం సంపద 719 బిలియన్ డాలర్లు, అంటే 53 లక్షల కోట్ల రూపాయలు. 555 కోట్ల మంది పేదలకు ఉన్న సంపద 98 మంది ధనవంతుల వద్ద ఉంది. ఇది దాదాపు 657 బిలియన్ డాలర్లు, అంటే 49 లక్షల కోట్ల రూపాయలు. ఈ 98 కుటుంబాల మొత్తం సంపద భారత ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో 41%.
టాప్ 10 వద్ద సొమ్ము 84 ఏళ్లపాటు రోజుకు 7.4 కోట్లు ఖర్చు చేయవచ్చు..
భారతదేశంలోని టాప్-10 ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు అంటే 7.4 కోట్లు ఖర్చు చేసినా, వారి సంపద ఖర్చు చేయడానికి 84 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు, దేశంలోని ధనవంతులపై సంపద పన్ను విధిస్తే, అప్పుడు 78.3 బిలియన్ డాలర్లు, అంటే 5.8 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. ఈ డబ్బుతో ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ 271% పెరగవచ్చు.
కరోనా కాలంలో 28% మంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారు
కరోనా కాలంలో 28% మంది మహిళలు తమ ఉద్యోగాలను కోల్పోయారు . దీంతో వారి మొత్తం సంపాదన మూడింట రెండు వంతులు తగ్గింది. మహిళల స్థితిగతులకు సంబంధించి, 2021 బడ్జెట్‌లో, ప్రభుత్వం మహిళా .. శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు మాత్రమే ఖర్చు చేసిందని, ఇది భారతదేశంలోని దిగువ-10 మిలియనీర్ల మొత్తం సంపదలో సగం కూడా కాదని ఈ నివేదికలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: Amazon Hyderabad: హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ ఎలా ఉందో చూశారా.? సౌకర్యాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..