Budget 2022: బడ్జెట్ 2022లో ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు ఎలా ఉండవచ్చు.. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్ ఎంత ఉండొచ్చు..

కేంద్ర బడ్జెట్ 2022 ప్రకటించడానికి పట్టుమని 15 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వంపై అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా, ఆరోగ్య సంరక్షణ (health care) రంగం కూడా తన స్వంత ప్రయోజనాల కోసం ఎదురుతెన్నులు చూస్తోంది.

Budget 2022: బడ్జెట్ 2022లో ఆరోగ్య సంరక్షణకు కేటాయింపులు ఎలా ఉండవచ్చు.. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్ ఎంత ఉండొచ్చు..
Health Budget 2022
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jan 24, 2022 | 10:42 PM

Health Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 ప్రకటించడానికి పట్టుమని 15 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వంపై అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా, ఆరోగ్య సంరక్షణ (health care) రంగం కూడా తన స్వంత ప్రయోజనాల కోసం ఎదురుతెన్నులు చూస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 1 ఫిబ్రవరి 2022 చేయబోయే బడ్జెట్ ప్రసంగంపై ఆరోగ్య సంరక్షణ రంగం ఎన్నో ఆశలతో ఉంది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రజలు అనారోగ్య పరిస్థితులను మున్నెన్నడూ లేని విధంగా ఎదుర్కుంటున్నారు. ఈ నేపధ్యంలో రానున్న బడ్జెట్ లో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంత కేటాయించవచ్చు అనే దానిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నిపుణులు ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఏవిధంగా కేటాయింపులు జరపాలి అనే అశంపై వెలుబుచ్చిన అభిప్రాయాల గురించి తెలుసుకుందాం.

ఆరోగ్య సంరక్షణ వ్యయంలో 10-12 శాతం పెరుగుదలను ప్రభుత్వం ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. హెల్త్‌కేర్ సెగ్మెంట్ దాని మొత్తం ప్యాకేజీలో రూ.18,000 కోట్ల అధిక కేటాయింపులను పొందే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 2021 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్య సంరక్షణకు రూ.223,846 కోట్లు మొత్తం వ్యయంగా ప్రకటించారు. అప్పుడు టీకాల కోసం చేసిన నిధి ఈ బడ్జెట్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ కోసం ప్రభుత్వం రూ. 50,000 కోట్లు కేటాయించింది. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

కరోనా నేపధ్యంలో వివిధ ఆరోగ్య సంరక్షక పథకాలకు మరికొంత బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి 31, 2022న ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ వరకు కొనసాగుతాయి.

రాష్ట్రపతి ప్రసంగం తర్వాత జనవరి 31న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెషన్ మొదటి భాగం ఫిబ్రవరి 11న ముగుస్తుంది. ఒక నెల రోజుల విరామం తర్వాత, సెషన్ రెండవ భాగం మార్చి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తుందని వర్గాలు తెలిపాయి. విరామ సమయంలో శాఖ సంబంధిత పార్లమెంటరీ కమిటీలు తమ మంత్రిత్వ శాఖలకు చేసిన బడ్జెట్ కేటాయింపులను పరిశీలించడానికి అనుమతిస్తాయి.

Also Read: Budget 2022: బడ్జెట్ 2022లో హెల్త్‌కేర్ రంగం ఎలా ఉండనుంది.. మౌలిక వసతులు పెరిగేనా?

Budget 2022: బడ్జెట్‌పై బ్యాంకింగ్ రంగం భారీ ఆశలు.. ఆ విషయంలో ప్రత్యేక మినహాయింపుల కోసం ఎదురుచూపులు!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో