AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2026 Highlights: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ రూ.53,752 కోట్లు

Andhra Pradesh Budget 2026 updates in Telugu: ఉదయం11 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

AP Budget 2026 Highlights: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ రూ.53,752 కోట్లు
Ap Budget 2026
Subhash Goud
| Edited By: |

Updated on: Feb 23, 2026 | 11:11 AM

Share

Andhra Pradesh Budget 2026 updates in Telugu: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఫిబ్రవరి 14న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తయారు చేసిన ఏపీ సర్కార్‌.. ఉదయం 11:15గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది.

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లు

అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే మా దృష్టిలో కేవలం పద్దుల లెక్కలు కాదు అని,భవిష్యత్ పై కొండంత ఆశలు చూపే బడ్జెట్ అంటూ ఆయన ప్రసంగించారు. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్‌. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన అన్నారు.

మూడో సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టం:

ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వరుసగా మూడో సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం నా అదృష్టమని అన్నారు మంత్రి. ఈ బడ్జెట్‌ రాయలసీమ ప్రజల కలలలను నెరవేరుస్తుందని, యవత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందన్నారు.

లైవ్‌ అప్‌డేట్‌ ఇక్కడ చూడండి:

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Feb 2026 01:43 PM (IST)

    అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా

    ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రకటించారు. బడ్జెట్‌ ప్రసంగాలు పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు మంగళవారానాకి వాయిదా పడ్డాయి.

  • 14 Feb 2026 01:41 PM (IST)

    Agriculture Budget: ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ రూ.53,752 కోట్లు

    • ధాన్యం సేకరణకు సంబంధించి రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లింపు.
    • పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు కేటాయింపు.
    • వ్యవసాయ యాంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు.
    • భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాల అందజేత.
    • ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు.
  • 14 Feb 2026 01:22 PM (IST)

    Polavaram Project: పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

    పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించామన్నారు మంత్రి. అలాగే డయాఫ్రం వాల్ నిర్మాణం ఇప్పటికే 91 శాతం పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు 60 శాతం వరకు పూర్తియినట్లు చెప్పారు. వంశధార-2, హంద్రీనీవా, పూలసుబ్బయ్య వెలిగొండ, పోలవరం పూర్తికి కృషి చేస్తున్నామని, గ్లోబల్ సమ్మిట్‌లో రూ.13.25 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయన్నారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పనులు 97 శాతం పూర్తయ్యాయని, ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు చెప్పారు. పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని, ఉచిత విద్యుత్‌తో లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

  • 14 Feb 2026 01:05 PM (IST)

    గ్లోబల్‌ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ

    గ్లోబల్‌ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ ప్రాంతమని మంత్రి తెలిపారు. రాయలసీమ కోసం ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణం 14.41 లక్షల హెక్టార్లకు విస్తరణ ఉంటుందన్నారు. ప్రపంచ మార్కెట్లతో అనుసంధానికి రోడ్ల కనెక్టివిటీ ఉంటుందని, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హార్టికల్చర్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా 9 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

  • 14 Feb 2026 01:01 PM (IST)

    విశాఖ ప్రాంతీయ ఆర్ధిక జోన్ కి 28,000 కోట్లు

    • విశాఖ ప్రాంతీయ ఆర్ధిక జోన్ కి 28,000 కోట్లు
    • విశాఖ జోన్ పరిధిలోకి 10 జిల్లాలు
    • 9 జిల్లాలతో అమరావతి ఆర్ధిక ప్రాంతం
    • రాయలసీమ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ కు 30,000 కోట్లు
    • ప్రతీ జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
  • 14 Feb 2026 12:44 PM (IST)

    తగ్గిన రెవెన్యూ లోటు..

    • 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.41,118.36 కోట్లు
    • 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.22, 002.50 కోట్లు
    • 2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ.80,567.47 కోట్లు
    • 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ.75,868.09 కోట్లు
  • 14 Feb 2026 12:43 PM (IST)

    వివిధ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు:

    • వీబీ జీ రామ్ జీ – రూ.8,365 కోట్లు
    • గృహనిర్మాణం (పట్టణ-గ్రామీణ) – రూ.5,451 కోట్లు
    • డాక్టర్ నందమూరి తారక రామారావు వైద్యసేవ ట్రస్ట్ – రూ.4,000 కోట్లు
    • జల జీవన్ మిషన్ – రూ.4,000 కోట్లు
    • రీ ప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ – రూ.2,144 కోట్లు
    • స్వచ్ఛభారత్ మిషన్ – రూ.1,037 కోట్లు
    • నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ – రూ.955 కోట్లు
    • ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ – రూ.838 కోట్లు
  • 14 Feb 2026 12:29 PM (IST)

    ఏపీ ఆదాయం

    • సంక్షేమం – 17 శాతం
    • విద్య – 11 శాతం
    • ఆర్ధికం – 8 శాతం
    • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – 7 శాతం
    • వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం – 6 శాతం
    • జలవనరులు – 6 శాతం
    • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ – 4 శాతం
    • విద్యుత్ రంగం – 4 శాతం
    • వ్యవసాయం, అనుబంధ రంగాలు – 4 శాతం
    • ఇతరాలు (హోం, ఆర్ అండ్ బీ, పరిశ్రమలు…) – 15 శాతం
    • వడ్డీలు, రుణాల చెల్లింపులు – 18 శాతం
    • పన్నుల ద్వారా ఆదాయం – 38 శాతం
    • పన్నేతర ఆదాయం – 3 శాతం
    • బహిరంగ మార్కెట్ రుణాలు – 30 శాతంకేంద్ర పన్నుల్లో వాటా – 19 శాతం
    • గ్రాంట్ ఇన్ ఎయిడ్ – 10 శాతం
  • 14 Feb 2026 12:27 PM (IST)

    ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..

    • అమరావతికి -రూ.6వేల కోట్లు.
    • మున్సిపల్ శాఖ-రూ.14,538.68కోట్లు.
    • EWS వెల్ఫేర్-రూ.10,699.33కోట్లు.
    • రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులు-రూ.13,546కోట్లు.
  • 14 Feb 2026 12:20 PM (IST)

    వ్యవసాయం-నీటి భద్రత కేటాయింపులు

    • పోలవరం-రూ.6,105కోట్లు
    • పీఎం కృషి సించాయి యోజన-రూ.190 కోట్లు
    • మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు-రూ.9,906 కోట్లు
    • అన్నదాత సుఖీభవ-రూ.6,600 కోట్లు
    • మత్స్యకార సేవలో-రూ.260కోట్లు
    • పంటల బీమా-రూ.250 కోట్లు
    • రాష్ట్రీయ కృషి వికాస్ యోజన-రూ.1,927 కోట్లు
    • ధరల స్థిరీకరణ నిధి-రూ.500 కోట్లు
  • 14 Feb 2026 12:10 PM (IST)

    రాష్ట్ర ఆదాయ నిర్మాణం ఇలా..

    • ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 38 శాతం
    • కేంద్ర పన్నుల వాటా – 19 శాతం
    • గ్రాంట్లు – 10 శాతం
    • నాన్ ట్యాక్స్ – 3 పైసలు
    • మార్కెట్ అప్పులు, బాధ్యతలు 30 శాతం
    • రాష్ట్ర పన్ను ఆదాయం -రూ.1,25,846 కోట్లు
    • కేంద్ర వాటా – రూ.64,362 కోట్లు
    • క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ – రూ. 53,915 కోట్లు
    • రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ – రూ.2,56,143 కోట్లు
    • వడ్డీ భారం – రూ. 37,281 కోట్లు
    • వడ్డీకి రోజుకు సుమారు రూ.102 కోట్లు
    • జీఎస్‌డీపీ – రూ.19,75,073 కోట్లు
    • వృద్ధిరేటు – 12.07%
  • 14 Feb 2026 12:05 PM (IST)

    బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

    • రాయలసీమ గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు రూ.30,000 కోట్లు
    • మూలధన వ్యయం రూ.53,915 కోట్లు.
    • బడ్జెట్‌ను రూ.3.32 లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు
    • తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు
    • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
    • రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
    • ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు
    • 2026-27 వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
    • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ విధానం: పయ్యావుల
    • ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా బడ్జెట్: పయ్యావుల
  • 14 Feb 2026 12:03 PM (IST)

    బడ్జెట్ కేటాయింపులు ఇలా..

    • విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు
    • రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
    • పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
    • సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
    • జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు
    • వీబీ జీ రామ్‌ జీకి.. రూ.8365 కోట్లు
    • గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
    • ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు
    • స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు
    • అమరావతి కోసం రూ.6వేల కోట్లు
    • అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు
    • మత్స్యకారులకు రూ.260 కోట్లు
    • బీసీలకు 23,650 కోట్లు
    • విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు
    • 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం
  • 14 Feb 2026 12:01 PM (IST)

    ఉన్నత విద్యకు – రూ.2,566 కోట్లు

    • ఉన్నత విద్యకు – రూ.2,566 కోట్లు
    • మనబడి మన భవిష్యత్తు-రూ.1,500 కోట్లు
    • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,232 కోట్లు
    • పీఎం స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా – రూ.707 కోట్లు
  • 14 Feb 2026 11:56 AM (IST)

    భవిష్యత్తుకు ఉపయోగపడేలా బడ్జెట్‌

    బడ్జెట్‌ ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల అన్నారు. ఇప్పటి వరకు ఏం సాధించాం.. ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తయారు చేసినట్లు చెప్పారు. కాగితాలకే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామన్నారు పయ్యవుల.

  • 14 Feb 2026 11:54 AM (IST)

    ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

    • బడ్జెట్ ప్రవేశపెట్టడమంటే కేవలం ఆదాయ వ్యయాలను వివరించడం కాదు.
    • ఏపీ రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేర్చేందుకు బడ్జెట్ అనేది రోడ్ మ్యాప్ వంటింది.
    • మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కడం నా అదృష్టం
    • ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసేలా ఉంటుంది
    • గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టాం.
    • స్వర్ణాంధ్ర విజన్-2047కు బాటలు వేస్తూ 2025 బడ్జెట్ ప్రవేశపెట్టాం.
  • 14 Feb 2026 11:50 AM (IST)

    బడ్జెట్‌ కేటాయింపులు

    • అమరావతికి రూ.6 వేల కోట్లు
    • రోడ్లు, పోర్ట్‌, ఎయిర్‌పోర్టులు – 13,546 కోట్లు
    • పరిశ్రమల శాఖ – రూ.3,161 కోట్లు
    • తల్లికి వందనం -9,668 కోట్లు
    • మహిళా, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు
    • వైద్య శాఖ -19,306 కోట్లు
    • వ్యవసాయ శాఖ – రూ.11,745 కోట్లు
    • బీసీ వెల్ఫేర్‌ – రూ.23,650 కోట్లు
  • 14 Feb 2026 11:47 AM (IST)

    రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లు

    • రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు.
    • మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా.
    • రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు.
    • ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు.
  • 14 Feb 2026 11:46 AM (IST)

    ఏ శాఖకు ఎంత బడ్జెట్‌

    • పాఠశాల విద్య రూ.32,308 కోట్లు
    • వైద్య శాఖ రూ.19,306 కోట్లు
    • వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు
    • సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు
  • 14 Feb 2026 11:44 AM (IST)

    ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌

    ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వరుసగా మూడో సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం నా అదృష్టమని అన్నారు. ఈ బడ్జెట్‌ రాయలసీమ ప్రజల కలలలను నెరవేరుస్తుందని, యవత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్‌ ఉంటుందన్నారు.

  • 14 Feb 2026 11:41 AM (IST)

    రెవెన్యూ లోటు బడ్జెట్‌

    • 2026–27 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు రూ. 22,002.50 కోట్లు
    • ఆర్థిక లోటు – రూ. 75,868.09 కోట్లు
    • ప్రాథమిక లోటు – రూ. 38,587.54 కోట్లు
  • 14 Feb 2026 11:34 AM (IST)

    స్వర్ణాంద్ర 2047 అనుగుణంగా బడ్జెట్‌

    స్వర్ణాంద్ర 2047కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్‌ అన్నారు. ఆయన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పరిస్థితులు పూర్తిగా మారాయని ఆయన అన్నారు.

  • 14 Feb 2026 11:32 AM (IST)

    ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు

    ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్‌. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లుగా ప్రకటించారు.

  • 14 Feb 2026 11:29 AM (IST)

    బడ్జెట్‌ అంటే భవిష్యత్తుపై కొండంత ఆశలు- పయ్యవుల

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంటే మా దృష్టిలో కేవలం పద్దుల లెక్కలు కాదు అని,భవిష్యత్ పై కొండంత ఆశలు చూపే బడ్జెట్ అంటూ ఆయన ప్రసంగించారు.

  • 14 Feb 2026 11:26 AM (IST)

    మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అనిత

    శాసన మండలి శనివారంనాడు ప్రారంభంకాగానే.. హోం మంత్రి అనిత వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

  • 14 Feb 2026 10:58 AM (IST)

    ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 11..15 గంటలకు అసెబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • 14 Feb 2026 10:03 AM (IST)

    అసెంబ్లీలో బడ్జెట్

    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్. దాదాపు రూ.3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

  • 14 Feb 2026 09:59 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

Published On - Feb 14,2026 9:58 AM

Follow Us