Pragna Sree: బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ చిచ్చర పిడుగు ప్రజ్ఞా శ్రీ.. చిన్నవయస్సులోనే ఎన్నో సేవలు

Pragna Sree: ఆ అమ్మాయి.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. చదువులో అత్యంత ప్రతిభావంతురాలు.. సేవలో కరుణామయురాలు.. ఆటల్లో దూకుడుగా ఉంటుంది.. సాంస్కృతిక

Pragna Sree: బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ చిచ్చర పిడుగు ప్రజ్ఞా శ్రీ.. చిన్నవయస్సులోనే ఎన్నో సేవలు
Pragna Sree
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 18, 2022 | 1:33 PM

Pragna Sree: ఆ అమ్మాయి.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. చదువులో అత్యంత ప్రతిభావంతురాలు.. సేవలో కరుణామయురాలు.. ఆటల్లో దూకుడుగా ఉంటుంది.. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆమెదే మొదటిస్థానం.. ఇలా ప్రతి అంశంలోనూ ముందుంటూ చిన్న వయస్సులోనే ఎంతో పేరు తెచ్చుకుంటోంది గొల్లపల్లి ప్రజ్ఞ శ్రీ..

14 ఏళ్ల ప్రజ్ఞ శ్రీ ఉగాండాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. చిన్న వయస్సులోనే ఎన్నో జంతువులను దత్తత తీసుకోని వాటి ఆలనా పాలనా చూసుకుంటోంది. అంతేకాకుండా పలు దేశాల్లో పర్యటిస్తూ.. ప్రకృతిలో విహరిస్తుంటుంది. ఉగాండాలో ఉండే ఈ చిన్నది.. ఏ కార్యక్రమమైన.. ఏ సందర్భమైన ముందుంటూ అటు కుటుంబం.. పాఠశాల నుంచి… ఇటు నాయకుల వరకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. విద్యాపరంగా తనకు గణితం, సైన్స్ అంటే చాలా ఇష్టమని.. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం.. సవాళ్లను స్వీకరించడం లాంటివి ప్రతిదీ ఇష్టమని ప్రజ్ఞా శ్రీ పేర్కొంటోంది.

ప్రజ్ఞా శ్రీ.. ఖాళీగా ఉన్న సమయాలల్లో వివిధ దేశాలకు వెళుతుంది. పాఠశాల స్థాయిలో జరిగే ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ వంటి జట్లలో చురుకైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చెస్, క్యారమ్స్ లాంటివి ఆడుతానని ప్రజ్ఞ శ్రీ పేర్కొంటోంది. తన కెరీర్‌లో అత్యంత ఉన్నతమైన స్థానానికి చేరుకునేందుకు ఎల్లప్పుడూ సరికొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తితో ఉంటానని పేర్కొంటోంది. ప్రకృతిలో కనిపించే అందమైన వస్తువులను చూసినప్పుడల్లా తన ఫోన్ కెమెరాతో బంధిస్తుంటుంది.

జంతు ప్రేమ.. ఈ చిచ్చర పిడుగు.. చిన్నతనంలో జంతువుల పట్ల ప్రేమను అలవర్చుకుంది. ఇంట్లో మూడు కుక్కలను, తాబేలు పెంచుతుంటుంది. అంతేకాకుండా జూలో ఏనుగు, సింహం పిల్లను దత్తత తీసుకుంది. ఏనుగుకు ప్రజ్ఞా, తాబేలుకు మధు, సింహానికి శ్రీ అనే పేర్లను కూడా పెట్టింది. అంతేకాకుండా లయన్ క్లబ్‌ను సైతం దత్తత తీసుకుంది. ఇవి జీవితంలో మరవలేనివని పేర్కొంటోంది.

మోదీ, ఉగండా అధ్యక్షుడితో.. ఈ చిచ్చర పిడుగు ఉగాండా స్టేట్ హౌస్‌లో అధ్యక్షుడు హెచ్‌ఇ యోవేరి కగుటా ముసెవెనిని సైతం కలిసింది. ఈ సందర్భంగా స్టేట్ హౌస్‌లో ఉగాండా జాతీయ గీతాన్ని ఆలపించింది. దీంతో అధ్యక్షుడు సైతం ఆమెను మెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీతో సైతం ఫోటో దిగింది. ఇది మరపురాని చిత్రం, గర్వించదగిన క్షణం అంటూ ఆమె బ్లాగ్‌లో రాసుకుంది. ప్రధాని మోదీ ఉగాండాకు వచ్చిన సందర్భంగా మోదీకి పుష్పగుచ్ఛం అందించింది.

ఫండ్.. మహమ్మారి సమయంలో.. స్టేట్ హౌస్‌లో నిర్వహించిన ఈవెంట్‌లలో నృత్య ప్రదర్శనలో వచ్చిన బహుమతి, తన వ్యక్తిగత పొదుపు మొత్తాన్ని జంతువుల సంరక్షణ కోసం అందించింది. ఈ ఫండ్‌ను నేరుగా ఉగండా ప్రెసిడెంట్ కు అందించి ప్రజ్ఞాశ్రీ ప్రశంసలందుకుంది. అంతేకాకుండా రోటరీ ఇంటర్నేషనల్ ఆఫ్రికా పీస్ కాన్సర్ట్ నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో సైతం ప్రజ్ఞాశ్రీ పాల్గొనడం విశేషం.

Also Read:

త్రినేత్రంతో ఆవు దూడ జననం.. శివుడి అంశగా భావిస్తున్న జనం.. ఎక్కడంటే..?