Vijay Mallya: లండన్ కోర్టులో మాల్యాకు చుక్కెదురు.. ఇంటి నుంచి బహిష్కరించనున్న స్విస్ బ్యాంకు..
Vijay Mallya loses battle to keep london: భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు విజయ్ మాల్యా
Vijay Mallya loses battle to keep london: భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు విజయ్ మాల్యా మరిన్ని కష్టాల్లో చిక్కుకున్నారు. ఆయన భారత్ నుంచి పారిపోయి లండన్‌లోని తన సొంత ఇంట్లో నివాసముంటున్న సంగతి తెలిసిందే. అయితే.. మాల్యా నివాసముంటున్న ఇంటిని స్విస్ బ్యాంకు జప్తు చేయనుంది. అప్పులు చెల్లించడంలో జాప్యం కారణంగా.. మాల్యాతోపాటు ఆయన కుటుంబసభ్యులను ఇంటినుంచి బహిష్కరించాలని లండన్ కోర్టు ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో మంగళవారం ఈ తీర్పునిచ్చింది.
లక్షలాది పౌండ్ల లావిష్ గ్రేడ్-1 హోం 18-19 కార్న్ వాల్ టెర్రస్‌లో ఉండే మాల్యా.. రెండు ఇళ్లను ఒకే ఇంటికి మార్చి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. భారత్ నుంచి పారిపోయిన అనంతరం 34ఏళ్ల తన కొడుకు సిద్ధార్థ, 95సంవత్సరాల తల్లి లలితాతో కలిసి అక్కడే ఉంటున్నారు.
అప్పులు చెల్లించకపోవడంతో స్విస్ బ్యాంకు కోర్టుకెక్కింది. అయితే.. ఈ కేసు విచారణలో కోర్టు పలు కీలక సూచనలు చేసింది. నోటీసులు అందాక కుటుంబం స్వతహాగా ఖాళీ చేయకుంటే.. ఇంటి నుంచి పంపేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. బ్యాంక్ ప్రొసీడింగ్స్ లో ఎటువంటి ఆలస్యం జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది.
లండన్ హైకోర్టు డిప్యూటీ మాస్టర్ రోస్ క్యాపిట్ పెట్టిన అప్లికేషన్‌ను, తీర్పు వాయిదా వేయాలన్న పిటిషన్ ను సైతం కొట్టేశారు. ఇప్పటికే సరిపడా సమయం ఇచ్చామని ఈ విషయంలో వేరే నిర్ణయం ఇస్తారని అనుకోవడం లేదని తెలిపారు. అయితే తీర్పు అనంతరం స్విస్ బ్యాంకు యూఎస్పీ ఇంటిని స్వాధీనం చేసుకోనుందని తెలుస్తోంది.
Also Read: