AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Scheme: కోవిడ్‌ సోకిన వారి కోసం ఎస్‌బీఐ ఈ ప్రత్యేక స్కీమ్‌ 3 నెలల ముందే నిలిపివేత.. ఇక రూ.20,000 పొందలేరు

SBI Scheme: ఒక వైపు కరోనా కేసులు, మరో వైపు ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇప్పుడు దేశంలో..

SBI Scheme: కోవిడ్‌ సోకిన వారి కోసం ఎస్‌బీఐ ఈ ప్రత్యేక స్కీమ్‌ 3 నెలల ముందే నిలిపివేత.. ఇక రూ.20,000 పొందలేరు
Subhash Goud
|

Updated on: Jan 19, 2022 | 8:11 AM

Share

SBI Scheme: ఒక వైపు కరోనా కేసులు, మరో వైపు ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇప్పుడు దేశంలో మరోసారి థర్డ్‌ వేవ్‌ రూపంలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ సోకిన ఉద్యోగులకు ఆర్థికంగా ఆదుకునేందుకకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (SBI) ఉద్యోగుల కోసం ఆర్థికంగా ఆదుకునేందుకకు స్పెషల్‌ సపోర్ట్‌ స్కీమ్‌ పేరుతో కొత్త పథకాన్ని గత ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ను 2022 మార్చి వరకు పొడిగించింది. కానీ గడువు ముగియకుండానే మూడు నెలల ముందుగానే ముగించేసింది బ్యాంకు.

ఎస్‌బీఐ స్పెషల్ సపోర్ట్ స్కీమ్ ( Sbi Special Support Scheme) కింద స్టేట్ బ్యాంక్ తన కోవిడ్ పాజిటివ్ ఉద్యోగులకు రూ. 20000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇటీవల ఈ పథకం పదవీకాలం 31 మార్చి 2022 వరకు పొడిగించబడింది. కానీ ఎకనామిక్ టైమ్స్’లోని ఒక నివేదిక ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని గడువుకు ముందే మూసివేసింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొంటుందనే నమ్మకంతో ముందుగానే ఈ స్కీమ్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది.

గతంలో కరోనా పాజిటివ్‌గా ఉన్న ప్రతి ఉద్యోగికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని జనవరి 1 నుండి నిలిపివేసినట్లు స్టేట్ బ్యాంక్ తెలిపింది. ఈ ప్రత్యేక పథకం బ్యాంకు ప్రస్తుత మెడికల్ స్పెషల్‌తో పాటు అందించబడింది. ఈ పథకం గడువు 31 మార్చి 2022 ఉంది. కానీ 3 నెలల ముందుగానే నిలిపివేయబడింది. గత ఏడాది అక్టోబర్‌లో, స్టేట్ బ్యాంక్ ఈ ప్రత్యేక పథకం తీసుకువచ్చింది. స్టేట్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ కార్మికుల్లో అసంతృప్తి కనిపిస్తోంది.

ఈ సందర్భంగా ఒక ఫ్రంట్‌లైన్ వర్కర్.. కరోనా కేసులు పెరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్‌లోని చాలా మంది ఉద్యోగులు థర్డ్‌ వేవ్‌లో కరోనా బారిన పడ్డారు. ప్రత్యేక స్కీమ్‌ ఉపసంహరణ నిర్ణయం ఫ్రంట్‌లైన్ బ్యాంక్ ఉద్యోగులకు అసంతృప్తి కలిగిస్తోంది. జనవరి 13న స్పెషల్ సపోర్ట్ స్కీమ్ 2020ని నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటనలో తెలిపింది.

పథకం ఎందుకు ఆగిపోయింది?

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనవరి మూడు లేదా నాలుగో వారంలో పాజిటివ్ కేసుల గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, చాలా మంది ఉద్యోగులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందున థర్డ్‌ వేవ్ ముప్పు సెకండ్‌ వేవ్‌ల ఉండదని బ్యాంకు అభిప్రాయపడింది. ఆసుపత్రుల్లో కోవిడ్ ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ లభ్యత ఉంది. గతంలో ఉన్నట్లు చికిత్సలో ఎటువంటి సమస్య ఉండదని బ్యాంక్ భావిస్తోందని ప్రకటనలో తెలిపింది. తన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు స్టేట్ బ్యాంక్ కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. క్వారంటైన్ కోసం హోటల్‌తో ఒప్పందం చేసుకుంది. సిబ్బందికి ప్రత్యేక సెలవులు అందించబడ్డాయి. కోలుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తోంది.

ఇవి  కూడా చదవండి:

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!

North Western Railway: రైల్వేకు కొత్త సొబగులు.. 305 కిలోమీటర్ల పనులు పూర్తి