Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!

Budget 2022: బంగారం ప్రియులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!
Follow us
Subhash Goud

| Edited By: Sahu Praveen

Updated on: Jan 20, 2022 | 10:20 PM

Budget 2022: బంగారం ప్రియులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది అభరణల ఎగుమతి ప్రమోషన్‌ కౌన్సిల్‌. బంగారంపై దిగుమతి సుంకం తగ్గితే, బంగారం ధరలు భారీగా దిగి వస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అభరణాలు, రత్నాల ఎగుమతి కౌన్సిల్‌ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుండి 2.5 శాతానికి తగ్గించాలని సూచించింది. నాలుగు శాతం సుంకం రేటుతో (బంగారం) దిగుమతి చేసుకుంటే… రూ.500 కోట్ల బదులు రూ.225 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అవుతుందని కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఒకే ఒక్క దెబ్బకి కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గిస్తే ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రతిపాదనలను కనుక కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే గోల్డ్ అక్రమ రవాణా కూడా తగ్గిపోతుంది.

ప్రస్తుతమున్న దిగుమతి సుంకం ఎంత?

గత బడ్జెట్‌లోనే కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. 12.5 శాతంగా ఉన్న ఈ దిగుమతి సుంకాన్ని 7.5 శాతానికి చేర్చింది కేంద్ర ప్రభుత్వం. మరోసారి ఇప్పుడు బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలనే డిమాండ్‌ ఉంది.

ఇవి కూడా చదవండి

Budget 2022: రాబోయే బడ్జెట్ కరోనా బాధితులకు హాస్పిటల్ ఖర్చులపై పన్ను మినహాయింపు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Budget 2022: కేంద్రం బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తుంది…? ఎలాంటి కసరత్తు ఉంటుంది..? ఎన్నో ఆసక్తికరమైన విషయాలు