Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget2022: ప్రతికూలతలు ఉన్నా భారత ఆర్ధిక అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందీ లేదంటున్న కార్పోరేట్ సీఈవోలు

దేశ ఆర్ధిక పరిస్థితిపై రకరకాలుగా వాదనలు వెలువడుతున్నాయి. వివిధ రకాలైన ఒత్తిళ్ళతో మన ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయితే, ఎంత ఎదురుగాలులు వీచినా మన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి గురించి నిపుణులు ఆశావాదంతోనే ఉన్నారు.

Budget2022: ప్రతికూలతలు ఉన్నా భారత ఆర్ధిక అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందీ లేదంటున్న కార్పోరేట్ సీఈవోలు
Economy Budget 2022
Follow us
KVD Varma

| Edited By: Sahu Praveen

Updated on: Jan 20, 2022 | 10:19 PM

Economy Budget 2022: దేశ ఆర్ధిక పరిస్థితిపై రకరకాలుగా వాదనలు వెలువడుతున్నాయి. వివిధ రకాలైన ఒత్తిళ్ళతో మన ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయితే, ఎంత ఎదురుగాలులు వీచినా మన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి గురించి నిపుణులు ఆశావాదంతోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాబోయే 12 నెలల్లో భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతుందని వారిలో ఎక్కువ మంది భావిస్తున్నారు. పీడబ్ల్యూసీ వార్షిక గ్లోబల్ సిఈవోల సర్వ్(PwC Annual Global CEO Survey) ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. భారతదేశానికి చెందిన 77 మందితో సహా 89 దేశాలకు చెందిన 4,446 గ్లోబల్ సీఈవో(CEO)లతో 2021 అక్టోబర్ నవంబర్‌ నెలల్లో ఈ సర్వ్ నిర్వహించారు. భారతదేశంలోని 99 శాతం సీఈవోలు రాబోయే సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి ఆశాజనకంగా ఉన్నారని దీనిలో తేలింది. 94 శాతం భారతీయ సీఈవోలు 77 శాతం ప్రపంచ సీఈవోలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ వ్యాపారాలను నిర్వహిస్తున్న నాయకులు మహమ్మారి తెచ్చిన సవాళ్ళను సమర్ధంగా ఎదుర్కున్నారు. అదే సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని బలంగా ఉద్భవించాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. అందుకే భారత్ లో వ్యాపారాలు స్థిరమైన వృద్ధిని చూపిస్తూ వస్తున్నాయి. అని పీడబ్ల్యూసి చైర్మన్ సంజీవ్ క్రిషన్ భారతదేశంలో అన్నారు.

కేంద్ర బడ్జెట్ 2022 కి ముందు భారత ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ కంపెనీల సిఈవోలు ఏమంటున్నారంటే..

–– 98 శాతం సిఈవోలు తమ సొంత కంపెనీల రాబడి అవకాశాల విషయానికి వస్తే రాబోయే 12 నెలల నుంచి వచ్చే మూడేళ్ల వరకూ వృద్ధిని చూపిస్తాయనే నమ్మకంగా ఉన్నారు.

–– 2022లో ఆర్థిక వృద్ధికి సంబంధించిన అవకాశాల గురించి గత సంవత్సరం (88 శాతం)తో పోలిస్తే భారతీయ సిఈవోలు మరింత ఆశాజనకంగా ఉన్నారు (94 శాతం).

–– 70 శాతం మంది భారతదేశ సిఈవోలు మహమ్మారిని వృద్ధికి ప్రధాన ముప్పుగా భావించారు. అయితే, 62 శాతం మంది సైబర్ బెదిరింపులను 2021లో వృద్ధికి అవరోధంగా భావించారు.

–– భారతదేశంలోని పీడబ్ల్యూసీ(PwC)చైర్మన్ సంజీవ్ క్రిషన్, కోవిడ్ 19, ఒమిక్రాన్ వేరియంట్ నీడను కనబరిచినప్పటికీ , సిఈవోలు తమ ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా వారి విశ్వాసం ఆశావాదం భారత కంపెనీల స్థిరమైన వృద్ధి అని ఆయన అన్నారు.

–– ఈ సంవత్సరం, 15 శాతం భారతీయ సిఈవోలు తమ కంపెనీ మూలధనాన్ని సమీకరించే సామర్థ్యాన్ని అడ్డుకునే సైబర్ ప్రమాదాల గురించి భయపడుతున్నారు.

–– సైబర్ రిస్క్‌లు తీవ్రమైన ఆదాయ అంతరాయాలను కలిగిస్తాయని భారతదేశ సిఈవోలు అంగీకరిస్తున్నారు. 64 శాతం మంది ఈ రిస్క్ ఉత్పత్తులు లేదా సేవల విక్రయాలకు ఆటంకం కలిగిస్తుందని భయపడుతున్నారు.

–– వ్యాపార అంతరాయాలతో పాటు, 47 శాతం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు సైబర్ బెదిరింపులు తమ ఉత్పత్తులు సేవలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని అడ్డుకోవచ్చని నమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి: Budget 2022: ఉపాధి రంగంలో యువత అంచనాలకు పెద్దపీట వేస్తారా.. ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారు?

Budget 2022: కరోనాతో మారుతున్న అంచనాలు.. వచ్చే బడ్జెట్‌లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి ఎసరు!