Budget 2022: టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు కేంద్రం సాయం.. బడ్జెట్‌లో రుణాల రీషెడ్యూల్‌కు ప్రణాళిక..!

Budget 2022: ప్రధాని మోదీ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2022 ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై పలు అంచనాలు

Budget 2022: టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు కేంద్రం సాయం.. బడ్జెట్‌లో రుణాల రీషెడ్యూల్‌కు ప్రణాళిక..!
Budget 2022
Follow us
Shaik Madar Saheb

| Edited By: Sahu Praveen

Updated on: Jan 20, 2022 | 10:18 PM

Budget 2022: ప్రధాని మోదీ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2022 ను ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై పలు అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పలు కంపెనీల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అంతేకాకుండా ప్రస్తుతం థర్డ్ వేవ్ కూడా అలజడి రేపుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టె బడ్జెట్‌పై పలు ఊహగానాలు మొదలయ్యాయి. అయితే.. కరోనా మహమ్మారి బారిన పడిన పరిశ్రమ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తక్షణ చర్యల్లో భాగంగా ఈ రంగంలోని కంపెనీలు తీసుకున్న రుణాలపై మారటోరియం, రుణాల పునర్నిర్మాణానికి ప్రత్యేక రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాడీ FHRAI మంగళవారం తెలిపింది.

ఆర్థిక మంత్రికి సమర్పించిన అంశాల్లో ఫెడరేషన్ ఆఫ్ హోటల్ & రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) కూడా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) కింద పొందిన రుణాలకు కనీసం ఒక సంవత్సరం పాటు మారటోరియం పొడిగింపును కోరింది. ఈ సెక్టార్‌లో అస్థిర ఆర్థిక వాతావరణం, మనుగడపై కీలక దృష్టి కేంద్రీకరించిందేకు గడువు ఇవ్వాలని సూచించింది. అలాగే, బ్యాంకులు, NBFCలకు కేంద్రం నుండి హామీతో వర్కింగ్ క్యాపిటల్ మద్దతు కోసం సీతారామన్‌ను అభ్యర్థించినట్లు FHRAI తెలిపింది. కోవిడ్ ప్రభావిత రంగానికి రూ. 60,000 కోట్ల లోన్ గ్యారెంటీ స్కీమ్‌ను తక్షణమే నోటిఫై చేయాలని, హాస్పిటాలిటీ సెక్టార్‌లోని ఉద్యోగులకు బేసిక్ పే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ జరగాలని సంఘం సూచించింది. యూనియన్ బడ్జెట్ 2022కి ముందు ఈ రంగానికి సంబంధించిన డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. కాగా కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించనుంది.

ఈ రంగానికి సంబంధించిన డిమాండ్లపై FHRAI వైస్ ప్రెసిడెంట్ గుర్బక్షిష్ సింగ్ కోహ్లీ మాట్లాడుతూ.. తాము ప్రస్తుతం మూడవ వేవ్ మధ్యలో ఉన్నామమని.. పరిశ్రమ మరో విపత్తును తట్టులేకపోవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. నష్టాల పరిధిని అంచనా వేస్తూ థర్డ్ వేవ్ పరిణామాలను తట్టుకుని నిలబడగలిగేలా తమ రంగానికి ప్రత్యేక ఉపశమన చర్యలను తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించారు. ఆంక్షల కారణంగా ఈ రంగం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోందని.. రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితి లేదని అభిప్రాయం వ్యక్తంచేశారు.

హాస్పిటాలిటీ పరిశ్రమ కోసం వడ్డీతో పాటు రుణాలను తిరిగి చెల్లించడానికి కనీసం ఒక సంవత్సరం మారటోరియం విధించాలని ఆయన కోరారు. దీనికి తోడు, పర్యాటకం, ఆతిథ్య రంగం అసమానమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రుణాల పునర్నిర్మాణం జరగాలన్నారు. ఈ రంగానికి మరోసారి రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించాలని కోహ్లీ అభ్యర్థించారు. 2020 ప్రారంభంలో మొదటి లాక్‌డౌన్ పరిమితులతో దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ రంగం స్తంభింపజేసిందని, ఆ తర్వాత కోలుకున్నా.. సెకండ్ వేవ్ లో ఏప్రిల్-మే 2021 మధ్యలో మరింత దిగజారిందన్నారు. టూరిజం పరిశ్రమ రూ. 1.40 లక్షల కోట్ల భారీ నష్టాన్ని నివేదించగా.. కోవిడ్ కారణంగా సుమారు 50 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలకు మారటోరియం అందించాలని కోరారు. ECLG పథకం కింద తీసుకున్న రుణాలకు కనీసం ఒక సంవత్సరం పొడిగింపు అవసరమని కోరారు.

అంతేకాకుండా తక్కువ వడ్డీతో, 100 శాతం ప్రభుత్వ గ్యారంటీ దీర్ఘకాలిక రీపేమెంట్ ఆప్షన్‌లతో రూ. 60,000 కోట్ల లోన్ గ్యారెంటీ స్కీమ్‌ను నోటిఫై చేయవలసిందిగా కోరారు. దేశంలో టూరిజం, హాస్పిటాలిటీ రంగం ఎదుర్కొంటున్న భారీ నష్టాలను పరిష్కరించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.

Also Read:

Budget2022: ప్రతికూలతలు ఉన్నా భారత ఆర్ధిక అభివృద్ధికి ఎటువంటి ఇబ్బందీ లేదంటున్న కార్పోరేట్ సీఈవోలు

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!