త్రినేత్రంతో ఆవు దూడ జననం.. శివుడి అంశగా భావిస్తున్న జనం.. ఎక్కడంటే..?

త్రినేత్రంతో ఆవు దూడ జననం.. శివుడి అంశగా భావిస్తున్న జనం.. ఎక్కడంటే..?
Three Eyed Calf

Weird News: ప్రపంచవ్యాప్తంగా రోజూ అనేక వింత (Odd News) సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. వీటిని చూసి అందరూ

Shaik Madarsaheb

| Edited By: Phani CH

Jan 17, 2022 | 1:13 PM

Weird News: ప్రపంచవ్యాప్తంగా రోజూ అనేక వింత (Odd News) సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ ఆవు మూడు కళ్లతో దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లాలో జరిగింది. ఈ వింత ఆవుదూడ.. మూడు కళ్లు (Three eyed calf), ముక్కులో నాలుగు రంద్రాలతో పుట్టింది.

అయితే.. మకర సంక్రాంతి రోజున ఆవు (Cow)కు ఈ దూడ జన్మించడంతో యజమాని, గ్రామస్థులు సాక్షాత్తూ శివుడి రూపమంటూ పూజిస్తున్నారు. ఈ వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలిస్తున్నారు. ఈ మూడు కళ్ల దూడను చూసిన ప్రజలు ఆశ్చర్యపోతూ .. భగవంతుని స్వరూపం అంటూ పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దూడ (Calf) కు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని గండాయ్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని.. పిండం వృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరిగిందంటూ పశువైద్యులు పేర్కొంటున్నారు. అయితే… దూడ ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Grandma Birthday: ఘనంగా 111 ఏళ్ల బామ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఐదు తరాల పిల్లలంతా ఒక్కటై..

Viral News: ఈ విస్కీ బాటిల్ బాగా కాస్ట్లీ గురూ.. ఎంత ధర పలికిందో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu