AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grandma Birthday: ఘనంగా 111 ఏళ్ల బామ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఐదు తరాల పిల్లలంతా ఒక్కటై..

Grand Birthday Celebrations: ఆ బామ్మకు 110 ఏళ్లు నిండాయి. 111వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆ శతాధిక వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలను

Grandma Birthday: ఘనంగా 111 ఏళ్ల బామ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఐదు తరాల పిల్లలంతా ఒక్కటై..
Birthday Celebrations
Shaik Madar Saheb
|

Updated on: Jan 17, 2022 | 9:57 AM

Share

Grand Birthday Celebrations: ఆ బామ్మకు 110 ఏళ్లు నిండాయి. 111వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆ శతాధిక వృద్ధురాలి పుట్టినరోజు వేడుకలను ఆమె కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలు ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగాయి. జిల్లాలోని చెరుకుపల్లి మండలం పడమటి పాలెం రాజవోలులో వెంకటజన్ను వెంకట సుబ్బమ్మ 111వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతా కలిసి ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతోపాటు భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

వెంకట సుబ్బమ్భకి మొత్తం తొమ్మిది మంది సంతానం.. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. వీరంతా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. 110 ఏళ్ళు నిండిన సందర్భంగా కుటుంబసభ్యులంతా గ్రామానికి వచ్చి.. సుబ్బమ్మ పుట్టిన రోజు వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె బర్త్ డే వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. కొడుకులు, కూతుళ్ళు, మనమలు, మనమరాళ్ళు, మునిమనమలు అంతా కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Grand Birthday

మొత్తం ఐదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులను చూసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె ఆహారపు అలవాట్లు, జీవన విధానంతోనే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉంటూ ఆమె పనులు ఆమె చేసుకోవడమే కాకుండా ఇంటి పనుల్లోనూ సాయం చేస్తూ ఉంటుందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుబ్బమ్మ కుటుంబంలోని మొత్తం 97 మంది పాల్గొనడం విశేషం.

టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు

Birthday

Also Read:

Viral Video: తగ్గేదెలే.. గాలిపటం ఎగరేస్తూ సంక్రాంతి సంబరాలు చేసుకున్న వానరం.. వైరల్ వీడియో..

Viral Video: 6 లక్షల తేనెటీగలతో కదలకుండా నిలబడి గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌ సృష్టించాడు.. వీడియో వైరల్‌