Viral Video: తగ్గేదెలే.. గాలిపటం ఎగరేస్తూ సంక్రాంతి సంబరాలు చేసుకున్న వానరం.. వైరల్ వీడియో..
Monkey flying kite Viral Video: దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. మకర సంక్రాంతి రోజు తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్,
Monkey flying kite Viral Video: దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. మకర సంక్రాంతి రోజు తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, రాజస్థాన్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.. అయితే ఈ పండుగ రోజు మనుషులే కాదు.. కోతి (Monkey) కూడా గాలిపటాలు ఎగురవేస్తూ ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవడాన్ని మీరెప్పుడైనా చూశారా..? అవును మీరు చదివింది.. కరెక్టే.. సోషల్ మీడియా (Social Media) ప్రపంచంలో ఒక కోతి వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఇందులో వానరం గాలిపటం ఎగురవేస్తూ కనిపిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. డాబాపై ఉన్న ట్యాంక్‌పై కోతి కూర్చుని ఉంటుంది. అది అక్కడ మాంజా పట్టుకుని గాలిపటం ఎగురవేయడాన్ని మీరు చూడవచ్చు. అయితే.. గాలిపటం తెగగానే.. మాంజా దాని దగ్గరకు వచ్చింది. దీంతో కోతి ఒక్కసారిగా మాంజా చేతిలో పట్టుకొని.. ఎగరడం ప్రారంభించింది. అంతేకాకుండా మాంజాతో గాలిపటాన్ని లాగడం మొదలుపెట్టింది.
ఈ సందర్భంగా స్వయంగా అదే… గాలిపటాన్ని ఎగరేసినంత ఆనందంలో మునిగి తెలుతూ కనిపించింది. ఈ సమయంలో ఆకాశంలో చాలా గాలిపటాలు ఎగురుతున్నాయి. అనంతరం గాలిపటాన్ని తనవైపుకు లాక్కుని వానరం గాలిపటాన్ని చింపేస్తూ కనిపించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి.
వైరల్ వీడియో..
On Makar Sankranti, the practice of kite flying in Jaipur is such that even monkeys fly kites. ? ? ? ? ? ? ? ? pic.twitter.com/sF4MdHR5wU
— Anil Kr Saini ? + (@anilsaini2004) January 15, 2022
సోషల్ మీడియాలో వైరల్ అవుతన్న ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించారు. చాలా లైక్‌లు, రీట్వీట్లు కూడా వచ్చాయి. ట్విట్టర్‌లో ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను @anilsaini2004 అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మకర సంక్రాంతి నాడు జైపూర్‌లో కోతులు కూడా గాలిపటాలు ఎగురవేస్తాయి’ అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కోతి గాలిపటాన్ని ఎగురవేసినట్లే కనిపిస్తోందని.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదంటూ పేర్కొంటున్నారు.
Also Read: