Viral video: తోకను పట్టుకుని యువకుడి వెర్రి చేష్టలు.. తగిన బుద్ధి చెప్పిన ఒంటె.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
ప్రముఖ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ చెప్పినట్లు ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. దానినే కొందరు కర్మ సిద్ధాంతం అని కూడా అంటుంటారు. ఈ క్రమంలో 'జంతువే నన్నేం చేస్తోంది' అని ఓ యువకుడు మూగజీవిని ఆట పట్టించాలని చూశాడు
ప్రముఖ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ చెప్పినట్లు ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. దానినే కొందరు కర్మ సిద్ధాంతం అని కూడా అంటుంటారు. ఈ క్రమంలో ‘జంతువే నన్నేం చేస్తోంది’ అని ఓ యువకుడు మూగజీవిని ఆట పట్టించాలని చూశాడు. ఓ వీధిలో ఒంటె పోతుంటే ఓ వ్యక్తి దానితో వెర్రివేషాలు వేశాడు. దాని వెనక వైపు వచ్చి తోకను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మరి తన మానాన తన పనేదో చేసుకుపోతోంటే అలా కదిలిస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఒంటెకు కూడా కోపమొచ్చింది. మెరుపు వేగంతో ఆయువకుడి దూలతీర్చేసింది. ఎడమ కాలితో..ఆ వ్యక్తి ని బలంగా తన్నింది . ఆ దెబ్బకు ఆ వ్యక్తి బోర్లా పడ్డాడు. ఏ మాత్రం ఊహించని ఈ ఘటనకు అక్కడున్నవారందరూ ఉలిక్కిపడ్డారు. ఒంటెకు దూరంగా జరిగారు. కానీ ఆ మూగ జంతువు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లిపోయింది.
బాగా బుద్ధి చెప్పింది..
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుసంత్ నందా తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి ‘ఇన్ స్టంట్ కర్మ’ అని తగిన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 77 వేలమంది వీక్షించడం విశేషం . 575 ట్వీట్లు లభించాయి. 5 వేలకు పైగా లైక్స్ వచ్చేశాయి. ‘ ఒంటె బాగా బుద్ధి చెప్పింది’, ‘పర్ ఫెక్ట్ కిక్’, ‘ఇన్ స్టంట్ జస్టిస్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Karma ?? pic.twitter.com/JFld1QYaQW
— Susanta Nanda IFS (@susantananda3) January 13, 2022
Also Read: ఈ మేకకు చికెన్ బిర్యానీ, మటన్ లేకుంటే ముద్ద దిగదు.. వీడియో
Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో