Assembly Elections 2022: ఒపీనియన్ పోల్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?

Assembly Elections Opinion poll: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో 2022 సార్వత్రిక ఎన్నికలపై అత్యంత ఖచ్చితమైన ఆన్-పాయింట్ ఒపీనియన్ పోల్‌ను రిపబ్లిక్ P-MARQ ప్రకటించింది.

Assembly Elections 2022: ఒపీనియన్ పోల్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా?
Assembly Elections
Follow us

|

Updated on: Jan 17, 2022 | 11:00 PM

5 States Assembly Elections 2022 Opinion polls: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల అభిప్రాయ సేకరణలు ఊపందుకున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో 2022 సార్వత్రిక ఎన్నికలపై అత్యంత ఖచ్చితమైన ఆన్-పాయింట్ ఒపీనియన్ పోల్‌ను రిపబ్లిక్ P-MARQ ప్రకటించింది.

ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ దేశం మొత్తం చూపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే ఉంది. దీనిని 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ-ఫైనల్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇక్కడి ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మార్చి 10న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నప్పటికీ సర్వేలో మాత్రం చిత్రం చాలా వరకు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలు వెలువడ్డాయి. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 252 నుంచి 272 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. దీని తరువాత, రెండవ అతి పెద్ద పార్టీగా సమాజ్ వాదీ పార్టీ అవతరించనుంది. ఎస్పీ ఖాతాలో 111-131 సీట్లు వెళ్లనున్నాయి. అదే సమయంలో, ఈ ఎన్నికల్లో బీఎస్పీ, కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా కనిపించింది. ఇక్కడ సర్వేలో ఇద్దరికీ వరుసగా 8-16 లేదా 3-9 సీట్లు వచ్చాయి. ఇది కాకుండా ఇతర పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులు 0-4 సీట్లు గెలుచుకోవచ్చని ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి. 2017 ఫలితాలతో పోలిస్తే, SP కూటమి 103 స్థానాల్లో భారీ జంప్ చేయగలదు. అయినప్పటికీ మెజారిటీకి దూరంగా ఉంది.

సీఎం యోగి వైపే మొగ్గు

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సర్వే ప్రకారం.. ఈసారి కూడా బీజేపీ 41.3 శాతం ఓట్లతో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వే ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఎస్పీకి 33.1 శాతం ఓట్లు దక్కే ఛాన్స్ ఉంది. బీఎస్పీకి 13.1 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు కేవలం 6.9 శాతం ఓట్లు, ఇతరులు 5.8శాతం ఓట్లు వస్తాయని ఓపినియన్ పోల్స్ చెబతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రజల ఎంపిక ఎవరిది? అదే సమయంలో, ముఖ్యమంత్రిగా తమ మొదటి ఎంపిక ఏమిటని సర్వేలో ప్రజలను అడిగినప్పుడు, 38.42 శాతం మంది యోగి ఆదిత్యనాథ్ పేరునే చెప్పారు. అయితే 31.51 శాతం మంది ప్రజలు అఖిలేష్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. 12.51 శాతం మంది మాయావతి, 8.30 శాతం మంది ప్రియాంక గాంధీ తమ ఎంపిక అని చెప్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 41.5% ఓట్లతో బీజేపీ తన 41 శాతం ఓట్లను నిలుపుకుంది.

పంజాబ్‌లో ఆప్‌కి పట్టం…

ఇక, పంజాబ్ విషయానికి వస్తే, మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అనుహ్యంగా అధికారంలోకి రావచ్చని సర్వే చెబుతోంది. ఆప్ 50-56 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఆ తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలవనుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 42-48 సీట్లు మాత్రమే దక్కే అవకాశముందని అంచనాలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఈ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ 13-17 దక్కే అవకాశముంది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఘోరంగా కనిపించింది. ఇక్కడ సర్వేలో 1-3 సీట్లు గెలుచుకోవచ్చని ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, ఆప్ 37.8 శాతం ఓటర్లు మద్దతు పలికవచ్చని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి 35.1శాతం, శిరోమణి అకాలీదళ్ పార్టీకి 15.8 శాతం, బీజేపీకి కేవలం 5.7శాతం మంది మాత్రమే ఓటేశారు.

ఉత్తరాఖండ్‌లో మరోసారి బీజేపీ..

ఇక, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చని సర్వే చెబుతోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 36-42 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఆ తరువాత రెండవ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలవనుంది. ఇక, అమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరనున్నట్లు తెలుస్తోంది. ఆప్ 0-2 సీట్లు దక్కించుకునే అవకాశముందని అంచనాలు చెబుతున్నాయి. ఇక, ఇతర పార్టీలు 1-3 సీట్లు గెలుచుకోవచ్చని ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, బీజేపీకి 39.9 శాతం ఓటర్లు మద్దతు పలికే అవకాశముందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి 37.5శాతం, ఆప్ పార్టీకి 13.1 శాతం, ఇతరులు 9.5శాతం ఓట్లు పోలయ్యే అవకాశముంది.

మణిపూర్‌లో బీజేపీదే విజయం

ఇక, మణిపూర్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చని సర్వే చెబుతోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 36-42 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఆ తరువాత రెండవ స్థానంలో కాంగ్రెస్ నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ 13-19 స్థానాల్లో విజయం సాధించవచ్చని పోల్స్ చెబుతున్నాయి. నాగా పీపుల్ పార్టీ 3-9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. నాగా పీపుల్ ఫ్రంట్ 1-5 సీట్లు గెలుచుకోవచ్చు. ఇక, ఇతర పార్టీలు 0-2సీట్లు సాధించవచ్చని ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి. అయితే, బీజేపీకి 39.2 శాతం ఓటర్లు మద్దతు పలికే అవకాశముందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి 28.7శాతం, నాగా పీపుల్ పార్టీకి 14.2 శాతం, నాగా పీపుల్ ఫ్రంట్ 6.4శాతం ఓట్లు, ఇతరులు 11.5శాతం ఓట్లు పోలయ్యే అవకాశముంది.

గోవాలో మళ్లీ బీజేపీదే అధికారం

గోవా రాష్ట్రంలో 2017 ఎన్నికలు పునరావృతం కానున్నాయి. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా మరోసారి అధికారంలోకి రానున్నట్లు ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 16-20 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఆ తరువాత రెండవ స్థానంలో కాంగ్రెస్ నిలవనుంది. కాంగ్రెస్ పార్టీ 9-13 స్థానాల్లో విజయం సాధించవచ్చని పోల్స్ చెబుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4-8 సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. అనుహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటనుంది. ఆ పార్టీ 1-5 సీట్లు గెలుచుకోవచ్చు. ఇక, ఇతర పార్టీలు 1-3 సీట్లు సాధించవచ్చని ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి. కాగా, బీజేపీకి 30.5 శాతం ఓటర్లు మద్దతు పలికే అవకాశముందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి 22.2శాతం, ఆప్‌కి 17.4శాతం, టీఎంసీకి 12.2శాతం ఓట్లు, ఇతరులు 17.7శాతం ఓట్లు పోలయ్యే అవకాశముంది.

కాగా, మార్చి 10న ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలైన పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ ఓట్ల లెక్కింపు జరగనుండడం గమనార్హం. ఈ లెక్కలు రిపబ్లిక్ P-MARQ తో కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం వెల్లడించినవి మాత్రమే, అయితే, ఎన్నికల అనంతరం వీటి శాతాల్లో మార్పు ఉంటాయని గమనించగలరు.

Read Also….  BJP: కరీంనగర్‌ కాషాయ దళంలో కలవరం.. బండి సంజయ్ సొంత ఇలాకాలో అసమ్మతి రాగం!